వివాదాస్పదమైన ఖడ్జూ వ్యాఖ్యలు.. మాజీ సీజేపై ఎఫ్ఐఆర్ నమోదు Controversy over Justice Katju's Facebook post

Controversy over justice katju s facebook post

Bihar Chief Minister Nitish Kumar, former Supreme Court judge Markandey Katju, Markandey Katju, Markandey Katju Bihar, bIhar, Janadhikar Party, JD(U), K. C. Tyagi, Kashmir, Lalu Prasad, Markanday Katju, Nitish Kumar, Pakistan, Patna, RJD, Shyam Rajak, Tejaswi Yadav

Reacting to Markandey Katju’s comments offering Kashmir to Pakistan on condition that it should take Bihar too, Chief Minister Nitish Kumar questioned if Mr Katju had become the mai-baap (guardian) of Bihar.

వివాదాస్పదమైన ఖడ్జూ వ్యాఖ్యలు.. మాజీ సీజేపై ఎఫ్ఐఆర్ నమోదు

Posted: 09/28/2016 09:18 AM IST
Controversy over justice katju s facebook post

ధేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూపై బిహార్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కశ్మీర్‌ కావాలని పట్టుబడుతున్న పాకిస్థాన్ కు బిహార్‌ను కూడా కలపి ప్యాకేజీగా ఇస్తామని, బీహార్ వద్దన్న పక్షంలో కాశ్మీర్ ను కూడా పాకిస్థాన్‌ వదులుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఖడ్జూ తమ రాష్ట్రాన్ని, రాష్ట్రవాసులను అవమానించారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తగా, అటు జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఖర్జూపై ఫిర్యాదు చేశారు.

బిహార్ను పాకిస్థాన్లో కలపాలంటూ ఖర్జూ చేసిన వ్యాఖ్యలు 10 కోట్ల మంది బిహార్ ప్రజలతోపాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులందరినీ తీవ్రంగా బాధించాయని నీరజ్ పేర్కొన్నారు. ఇక మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించడమేనని నితీశ్‌ పేర్కొన్నారు. ’బిహార్‌కు ఆయన తల్లీతండ్రా? లేక​ యజమానా’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కట్జూ పేరును నితీశ్‌ ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యాయకోవిదుడైన వ్యక్తి ఇంత దారుణంగా ఒక రాష్ట్రాన్ని, ప్రజలను అవమానించడం దారుణమని అన్నారు. నిజానికి నితీశ్‌కు జస్టిస్‌ కట్జూకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. గతంలో కట్జూ ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు బాహాటంగానే నితీశ్‌ సర్కారును దుయ్యబట్టారు. బిహార్‌లో ప్రతికా స్వేచ్ఛ ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా జస్టిస్‌ కట్జూ తప్పుబట్టారు. దీంతో ఖడ్జూపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bIhar  Janadhikar Party  JD(U)  K. C. Tyagi  Kashmir  Markanday Katju  Nitish Kumar  Pakistan  Tejaswi Yadav  

Other Articles