బాప్ ఏక్ నంబర్... బేటా దస్ నంబర్ | Photo of Lalu Prasad Yadav with Siwan murder suspect emerges

Photo of lalu prasad yadav with siwan murder suspect emerges

Photo of Lalu Prasad Yadav with Siwan murder, Lalu Prasad Yadav with Siwan murder suspect, RJD leaders photos with Siwan murder suspect, Siwan murder Case, Ranjan Murder Case, Lalu with Ran

After His son, Photo of Lalu Prasad Yadav with Siwan murder suspect emerges.

అయ్య చేనులో మేస్తే కొడుకు గట్టున మేస్తాడా?

Posted: 09/28/2016 09:22 AM IST
Photo of lalu prasad yadav with siwan murder suspect emerges

బీహార్ లో జింగిల్ రాజ్యం ఎలా ఉంటుందంటే... అక్కడి నేతలకు, క్రిమినల్స్ తో ప్రత్యక్షంగా లింకులుంటాయి. సంచలనం సష్టించిన శివాన్‌ జర్నలిస్ట్‌ రంజన్‌ హత్య కేసులో పరారీలో వున్న నిందితుడు జావెద్‌ భట్‌తో ఆర్జేడీ చీఫ్ లాలూ కొడుకు, ఆరోగ్య శాఖా మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు ఫోటో దిగి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇక ఆ విషయంలో తానేం తక్కువ కాదు అంటున్నాడు లాలూ. అదే నిందితుడితో లాలూ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్లో సంచలనంగా మారింది.

ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు.

Lalu with siwan case murderer

ఇక, రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటోపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇక రంజన్‌ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇటీవల భట్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భట్‌, మరో నిందితుడు జిమ్మి పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు కైఫ్‌, సోను కోర్టులో లొంగిపోయారు. కైఫ్‌తో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ కలిసి వున్న ఫొటో వెలుగులోకిరాగా, దానిపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల లాలూ తనయుడికి నోటీసులు జారీ చేసింది. రంజన్‌ హత్య కేసు నిందితులకు రక్షణ కల్పించిన మీపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయకూడదో సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, షాబుద్దీన్‌లను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles