ప్రముఖ నటికి ముక్కోపం తెప్పించిన మూషికం.. కేంద్రమంత్రికి పిర్యాదు Nivedita Saraf bag was gnawed by rats in train journey

Nivedita saraf complains union minister on rats in train

Ashok Saraf,indian railways,Latur,Marathi actress,Marathi films,Nivedita Ashok Saraf,Nivedita Joshi,Nivedita Joshi Saraf,Nivedita Saraf,Suresh Prabhu, Rats, Suresh Prabhu, latur express, railway minister

Popular Marathi actress Nivedita Saraf has complained that her bag was gnawed by rats while she was travelling by a train, prompting the railway administration to intensify the pest control measures.

ప్రముఖ నటికి ముక్కోపం తెప్పించిన మూషికం.. కేంద్రమంత్రికి పిర్యాదు

Posted: 09/27/2016 05:00 PM IST
Nivedita saraf complains union minister on rats in train

రైలు ప్రయాణికులు బాధలు వర్ణాణాతీతం. అదేంటి అంటారా..? ఎవరి బాద వారిదే అన్నట్లు రిజర్వేషన్ టిక్కెట్లు లభ్యం కాక కొందరు అవస్థలు పడుతూ రైలు ప్రయాణాలను అడిపోసుకుంటుండగా, మరికోందరి తమ బాధలను చెప్పుకుని మరీ భాధపడుతుంటారు. తమకు అర్ఏసీలో సీట్లు కన్ఫాప్ కావడంతో కూర్చోని ప్రయాణం చేశామని ఇలా ఒక్కోక్కరు ఒక్కోలా తమ వ్యధలను కథలు కథలుగా చెప్పుకుని బాధపడుతడం మనం చూశాం. అయితే ప్రముఖ నటికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

అయితే అందరిలా ఆమె తన భాదను తన స్నేహితులతో కాకుండా ఏకంగా తమ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు చెప్పుకుంది. అంతలా అమెను బాధించిదేమిటినీ అనేగా మీ డౌట్..? రైలులో ప్రయాణిస్తుండగా అమె బ్యాగును ఎలుక కొరికేసిందని మరాఠి నటి నివేదిత సరాఫ్.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైలులో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్ప్రెస్ లో ఏసీ బోగీలో ఆమె ప్రయాణించారు.

తన బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసింది. రైలు ప్రయాణం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె వాపోయింది. ఎలుక కొరికిన బ్యాగు ఫొటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ స్పందించారు. ఎలుకలను పెస్ట్ కంట్రోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టుకుంటారని చెప్పారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నివేదిత సరాఫ్ ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చెబుతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nivedita Saraf  Rats  Suresh Prabhu  latur express  railway minister  

Other Articles