సీఎన్ఎన్ డిబేట్ లో డోనాల్డ్ కు చుక్కలే.. చుక్కలు.. Clinton puts Trump on defense at first debate

Clinton puts trump on defense at first debate

Democratic presidential candidate, Republican presidential candidate, hillary forced trump onto defensce, Hillary Clinton, Donald Trump, US Presidential Debate, debut presidential debate, cnn orc poll

Hillary Clinton forced Donald Trump onto defense over his temperament, refusal to release his taxes and his past comments about race and women during a fiery debut presidential debate.

సీఎన్ఎన్ డిబేట్ లో డోనాల్డ్ కు చుక్కలే.. చుక్కలు..

Posted: 09/27/2016 03:36 PM IST
Clinton puts trump on defense at first debate

అమెరికా అధ్యక్ష ఎన్నికలు తది అంకానికి చేరింది. ఈ తుది అంకంలో భాగంగా అభ్యర్థుల బిగ్ డిబేట్ కూడా జరగింది. డెమోక్రటిక్ అభ్యర్థికి హిల్లరీకి.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు మధ్య జరిగిన ఓపెన్ డిబేట్ లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ డిబేట్ లో హిల్లరి చాలా చాకచక్యంగా సమాధానాలు చెబుతూ విజయం సాధించగా, హిల్లరీతో పాటు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు సంధించిన ట్రంప్ వెనకంజలో నిలిచారు. నవంబర్ లో జరగనున్న ఎన్నికలకు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ చర్చ జరుగుతుండగా ప్రముఖ మీడియా సంస్థ సీఎఎన్ఎన్-ఓఆర్సీ సంస్థ ఈ పోల్ నిర్వహించింది.

అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన దాదాపు 100 మిలియన్ల మంది అధ్యక్షుల బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని వీక్షించారని సర్వే పేర్కొంది. ఈ డిబేట్ లో హిల్లరీకి 62శాతం మద్దతు లభించగా.. డోనాల్డ్ ట్రంప్ కు 27శాతం మద్దతుమాత్రమే దక్కిందని కూడా సదరు డిబేట్ కు అతిధ్యం వహించిన సంస్థ పేర్కోంది. ఈ సమయంలోనే సీఎన్ఎన్-ఓఆర్సీ టీవీ వీక్షకుల నుంచి అభిప్రాయం కోరగా 62శాతం మంది క్లింటన్ కు మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్ కు మద్దతిచ్చారు. గతంలో వీరి మధ్య వత్యాసం అత్యంత స్వల్పంగా వుండగా, ఈ సారి భారీగా కనిపించింది.

ఈ నెల 19న వెల్లడైన సర్వేలో కూడా డోనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతు వచ్చారు. అప్పుడు లైక్లీ ఓటర్లలో హిల్లరీకి 42 శాతం, ట్రంప్‌కు 40 శాంత మంది మద్దతు ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ పోల్ ద్వారా తెలిసింది. రిజిస్టర్డ్ ఓటర్లలో 39శాతం మంది హిల్లరీకి, 38శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లు పొలిటికో సంస్థ తెలిపింది. హిల్లరీ కచ్చితంగా గెలుస్తారని 47 శాతం మంది భావించగా, ట్రంప్ విజయం మీద 33 శాతం మందికే నమ్మకం ఉంది. ఈ క్రమంలో జరుగుతున్న బిగ్ డిబేట్ లో హిల్లరీకి చాలా అనుభవం వుందని ట్రంప్ కూడా అంగీకరించక తప్పలేదు.

బిగ్ డిబేట్ కార్యక్రమంలో ముందునుంచే హిల్లరీ చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పడంతోపాటు, ట్రంప్ వ్యాఖ్యలపై తెలివిగా దాడులు చేస్తూ వచ్చారు. హిల్లరీ మాత్రం ప్రణాళికను వివరించగా ట్రంప్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. హిల్లరి చాలా చెడ్డదని ఆయన ఏకంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హిల్లరీ చెప్పగా.. గతంలో కంపెనీలకు ఉన్న 35శాతం పన్నును 15శాతానికి తగ్గిస్తామని ట్రంప్ అన్నారు. అయితే, పన్ను మినహాయింపు వల్ల ధనవంతులే బాగుపడతారని హిల్లరీ చెప్పారు. కార్పొరేట్ లొసుగులు తొలిగిస్తామని చెప్పారు.

నిర్మాణ రంగం, టెక్నాలజీ ఇతర రంగాల్లో ఉద్యోగ వృద్ధి చేస్తామని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పారు. అయితే, ఈ డిబేట్ గెలవడమే లక్ష్యంగా హిల్లరీ ప్రిపేర్ అయి వచ్చిందని, ఆమె గెలుస్తుంది కూడా అని చెప్పగా.. తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నందున తన దేశ ప్రజలకు ఏమేం చేయగలననే అంశాలనే చెప్తున్నానని, ఆ మాత్రం బాధ్యతగా ప్రిపేర్ అవ్వకుంటే ఎలా అంటూ స్మార్ట్ గా సమాధానం ఇచ్చారు. ఇలా మాట్లాడుతూ ఆమె అనూహ్యంగా పెద్ద మొత్తంలో ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles