రన్నింగ్ రైలు నుంచి దిగిన యువతికి ఎంత కష్టం.. Akshay Kumar shares horrific video of Mumbai police constable

Akshay kumar shares horrific video of mumbai police constable

Akshay Kumar,akshay kumar twitter video,mumbai police constable,police constable saves woman's life video,Pawan Tayde Lonavala police station,akshay kumar films,woman falls out of running train video

Akshay tweeted a video of a terrifying moment at a train station where the woman is seen falling off a running train.

ITEMVIDEOS: ముంబై రైల్వే పోలీసుకు బాలీవుడ్ నటుడి కితాబు..

Posted: 09/27/2016 01:03 PM IST
Akshay kumar shares horrific video of mumbai police constable

రన్నింగ్ బస్సు, రన్నింగ్ ట్రైన్ దిగడం ముఖ్యంగా యువతకు అలవాటుగా మారిపోయింది. ఇందుకు అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా అందరూ రన్నింగ్ లో దిగేందుకు పలువురు అసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇలా రన్నింగ్ లోనే దిగితే ఎదురయ్యే పరిణామాలు ఎంత భయానకంగా వుంటాయో తెలియనంత వరకు సరే.. కానీ, ఆ అనుభవం ఎదురై కొద్దిలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రమాదం నుంచి బయటపడితే.. ఎలా వుంటుంది.

సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోన్న ఓ ప్రయాణికురాలి వీడియోను తన అభిమానులతో పంచుకుని తస్మాత్ జాగ్రత్తా.. రన్నింగ్ లో ఎప్పుడూ దిగరాదని అభిమానులకు చెప్పాడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. అంతేకాదు అమెను సకాలంలో స్పందించి రక్షించిన కానిస్టేబుల్ ను కూడా ఆయన ప్రశంసించారు. ఇంతకీ అ బాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా..? ఆయన మరెవరో కాదు.. అక్షయ్‌కుమార్‌. సామాజిక విషయాల్లోనూ చురుగ్గా ఉండే ఈయన.. తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో ఓ షాకింగ్‌ వీడియో పోస్టు చేశారు.

ముంబై రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు నుంచి రన్నింగ్ లోనే దిగుతూ ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. తన వస్తువులను తాను తాకడంతో.. అమె అకస్మాత్తుగా అమె దిగిన రైలు కిందకు జారిపోయింది. రైలుకు ప్లాట్ ఫాం మద్య చిక్కుకుని కిందకు జారుకుంటుంది. ఈ క్రమంలో రైలు కిందకు వెళ్లిపోతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ చురుగ్గా స్పందించి కాపాడాడు. వెంటనే ఆమెను ఇటువైపు లాక్కొచ్చి ప్రాణాలు నిలబెట్టాడు. ఆ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని అక్షయ్‌కుమార్‌ కొనియాడుతూ ట్వీట్‌ చేశారు.

'ఈ వీడియో చూసి తన గుండెలు ఆగినంత పనైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోనావాలా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌ తాయ్‌డేకు సెల్యూట్‌' అంటూ అక్షయ్‌ పేర్కొన్నాడు. 'పోలీసులు నిజమైన హీరోలు అని నేను గతంలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను' అని వారి సేవల్ని కొనియాడారు. నడుస్తున్న రైలు నుంచి మహిళ పడిపోయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా ప్లాట్‌ఫామ్‌ మీద పడిపోవడం గమనించవచ్చు. 'రుస్తుం'తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అక్షయ్‌కుమార్‌ త్వరలో 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2', 'రోబో-2' సినిమాలతో రానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshay kumar  shocking video  Pawan Tayde  Lonavla police station  crime  

Other Articles