పాక్ దోషిత్వాన్ని నిరూపించేందుకు ఈ సాక్షాలు చాలవా..? Abandon Kashmir dreams, Sushma Swaraj tells Pakistan

Abandon kashmir dreams sushma swaraj tells pakistan

sushma swaraj, sushma swaraj un, pakistan, sushma swaraj pakistan, unga, un, narendra modi, sushma swaraj, shashi tharoor, United Nations, Indian foreign ministry, Sushma Swaraj, Kashmir issue, UNGA,, india news

"Congrats to EAM @SushmaSwaraj for a firm, effective & fine articulation of a wide range of global issues at UNGA," he tweeted shortly after Swaraj delivered the address.

పాక్ దోషిత్వాన్ని నిరూపించేందుకు ఈ సాక్షాలు చాలవా..

Posted: 09/26/2016 09:35 PM IST
Abandon kashmir dreams sushma swaraj tells pakistan

ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపై పాకిస్థాన్ వైఖరిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తూర్పారబట్టారు. తీవ్రవాదానికి ఊతం ఇస్తున్న దాయాది దేశాన్ని ఏకాకిని చేసే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి 71వ జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. బలూచిస్తాన్ లో పాక్ అరాచకాలను ప్రపంచం దృష్టికి తెచ్చారు. భారత్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న పాకిస్థాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

తీవ్రవాదులకు బాహాటంగానే మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ తమపై విద్వేషంతో విషం కక్కుతోందని తెలిపారు. ముంబై దాడుల సూత్రధారి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. పాక్ సాగిస్తున్న సరిహద్దు తీవ్రవాదానికి బహదూర్ అలీ ప్రత్యక్ష రుజువని చెప్పారు. అద్దాల మేడలో ఉన్నవారు ఇతరులపై రాళ్లు వేయరాదని చురక అంటించారు. తీవ్రవాదానికి మద్దతు దేశాలను ఏకాకిని చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత్ లో కశ్మీర్ అంతర్భాగమని.. అలాగే ఉండాలని, ఉంటుందని సుష్మా స్వరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United Nations  Indian foreign ministry  Sushma Swaraj  Kashmir issue  UNGA  

Other Articles