ఒక్క రాకెట్ తో ఎనిమిది ఉపగ్రహాలతో సంచలనం | ISRO launched eight satellites with from PSLV rocket from Sriharikota

Isro launched eight satellites with from pslv rocket from sriharikota

ISRO launched eight satellites with from PSLV-35 , eight satellites with from PSLV C-35, SCATSAT-1 from Sriharikota SHAR. Eight Satellites details SCATSAT-1

ISRO launched eight satellites with from PSLV C-35 SCATSAT-1 from Sriharikota SHAR.

ITEMVIDEOS:ఇస్రో అద్భుతం: ఒక రాకెట్... 8 శాటిలైట్లు గ్రాండ్ సక్సెస్

Posted: 09/26/2016 09:41 AM IST
Isro launched eight satellites with from pslv rocket from sriharikota

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో మరో అరుదైన ప్రయోగం. ఇస్రో ఘనవిజయంతో భారత కీర్తి పతాక విరజిల్లింది. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపడంతో పాటు, వాటిని ఒకేసారి భిన్న( వేర్వేరు) కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష పరిశోధనాకేంద్రం (షార్) అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 9.12 నిమిషాలకు ఈ లాంఛింగ్ జరిగింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ సీ-35) రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లయి. ఒకే రాకెట్‌, రెండు కక్ష్యల్లో 8 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి ప్రవేశపెట్టం ద్వారా అద్భుతానికి తెరలేపాయి. పీఎస్‌ఎల్వీ 35 నుంచి ప్రయోగించే ఉపగ్రహాల్లో అమెరికా, కెనడాల నుంచి ఒక్కొక్కటి, అల్జీరియాకు చెందిన మూడు, రెండు భారత విద్యాసంస్థలు తయారుచేసిన నానో శాటిలైట్లు ఉన్నాయి.


స్కాట్‌శాట్ 1 ఉపగ్రహం :
తుఫాన్లు, సునామీలను పసిగట్టడంతోపాటు, సముద్రాలు, వాతావరణ పరిస్థితుల అధ్యయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో స్కాట్‌శాట్ 1 ఉపగ్రహ ప్రయోగం పంపింది. స్కాట్‌శాట్ సహా మరో ఏడు ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. స్కాట్‌శాట్ 1ను 720 కిలోమీటర్ల దూరంలో, మిగతా ఏడు ఉపగ్రహాలను 670 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఇవి పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ (ఎస్‌ఎస్‌వో)లోకి ప్రవేశిస్తాయి. అవి నిరంతరం ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య సూర్యుడి దిశగా తిరుగుతాయి. ఇందుకు అనుగుణంగా ఇస్రో రెండు విభిన్న కక్ష్యల్లో పేలోడ్స్ అమర్చిన ఉపగ్రహ వాహన నౌక పీఎస్‌ఎల్వీ ప్రయోగం ఇదే తొలిసారి.

-వాతావరణ, సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితుల అధ్యయనానికి రూపొందించిన ఉపగ్రహం స్కాట్‌శాట్ 1. సముద్ర తీరం నుంచి వీచే గాలుల సాయంతో వాతావరణ, తుఫాన్ దిశ తదితర అంశాలను ఈ ఉపగ్రహం ద్వారా అధ్యయనంచేయొచ్చు. 2009లో ప్రయోగించిన ఓషన్‌శాట్ 2కు ప్రత్యామ్నాయంగా సముద్ర ఉపరితల పరిస్థితులపై అధ్యయనానికి ఉపకరిస్తుంది.
-యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ సహకారంతో ఐఐటీ బాంబే విద్యార్థులు తయారుచేసిన ప్రథమ్ ఉపగ్రహం పది కిలోల బరువు ఉంటుంది. అయితే దాని జీవిత కాలం కేవలం నాలుగు నెలలు మాత్రమే.
-బెంగళూరులోని పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (పెసిట్) అభివృద్ధిచేసిన ఉపగ్రహం పెసిట్ ఇమేజింగ్ శాటిలైట్ (పీశాట్). దీన్ని రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల కోసం వినియోగిస్తారు. ఈ ఉపగ్రహం భూ ఉపరితలంపై నెలకొన్న పరిస్థితిని సుమారు 362 అడుగుల రిజల్యూషన్‌తో కూడిన చిత్రాలను పంపుతుంది.
-అల్‌శాట్ 1బీ, అల్‌శాట్ - 2బీ, అల్‌శాట్ 1 ఎన్ ఉపగ్రహాలు అల్జీరియా రూపొందించినవి.
-అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ రూపొందించిన వాణిజ్య ప్రయోజనాల ఉపగ్రహం పాథ్‌ఫైండర్ 1. మూడేండ్ల జీవిత కాలం గల ఈ ఉపగ్రహం బరువు 44 కిలోలు ఉంటుంది. పాథ్ ఫైండర్ 1 కొనసాగింపుగా వచ్చే నవంబర్‌లో పాథ్ ఫైండర్ 2 ఉపగ్రహాన్ని కూడా ఇస్రో ప్రయోగించనున్నది.
-యూనివర్సిటీ ఆఫ్ టోరెంటో రూపొందించిన క్యాన్‌ఎక్స్ 7 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో భూమిపై ప్రయోగాలతో దూళి తగ్గింపు అవకాశాల అధ్యయనానికి ఉపయోగిస్తారు.
-ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్వీకి నాలుగు వేర్వేరు దశలు ఉన్నందు వల్లే దీన్ని బహుళ దశల ఉపగ్రహంగా పరిగణిస్తున్నారు.

అరుదైన ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ శనివారం ఉదయం 8.42 గంటలకు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దేశీయ ఉపగ్రహాలతోపాటు విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారి సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది.

 

శనివారం ఉదయం 8.42 గంటలకు 48 గంటల కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం ఘన, ద్రవ ఇంధనాలను నింపడంతోపాటు ఈ ఉప గ్రహాల అనుసంధాన ప్రక్రియను శాస్త్రవేత్తలు మరో సారి పరిశీలించారు. అనంతరం సోమవారం ఉదయం అనుకున్న సమయానికే ప్రయోగాన్ని ప్రారంభించి విజయంవంతం అయ్యారు. 2.15 గంటల్లో ఉపగ్రహాల ప్రయోగ ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, 2017లో అంగారక గ్రహానికి సంబంధించి కీలక ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు వేసిన నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి గర్వకారణమని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  Sri Harikota  PSLV-35  eight satellites  SCATSAT-1  

Other Articles