నిత్య పెళ్లిళ్ల కూతురి ట్రాక్ రికార్డుకి బ్రేక్ పడింది | 10 days after marriage bride cons hubby out of rs 1 lakh

10 days after marriage bride cons hubby out of rs 1 lakh

Serial Bride arrested, Fake Marriage Rocket, Serial Bride escapes with money from Hubby's House, 10 days after marriage bride cons, Maharashtra girl cheat with serial marriages, yogita and rajput marriage, Bride and her brother arrested

Serial Bride escapes with money from Hubby's House along with her Brother.

కొత్త పెళ్లికొడుక్కి కోలుకోలేని షాక్

Posted: 09/24/2016 03:33 PM IST
10 days after marriage bride cons hubby out of rs 1 lakh

అమరైవాడి పోలీసులు 22 ఏళ్ల నవ వధువును, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. కాళ్ల పారాణి ఆరక ముందే ఆమెను కటకటాలకు నెట్టేశారు. ఆమె చేసిన మోసం అలాంటిది మరి. ఇంతకీ ఆమె ఏం చేసింది? మొగుడు పోలీసులను ఎందుకు ఆశ్రయించాడు. తెలియాలంటే గుజరాత్ కి వెళ్లాల్సిందే.

అమర్ వాడీలోని ఆదర్శ్ అపార్ట్ మెంట్లో నివాసం ఉండే రాజ్ పుత్ కు సంబంధాల వేటలో ఉన్నారు బంధువులు. తండ్రి లేకపోవటంతో మేనమామ రమేష్ దగ్గరుండి మరీ వ్యవహారం చూసుకుంటున్నాడు. ఇంతలో ఓ మ్యారేజ్ కన్సల్టెన్సీలో మహారాష్ట్రకి చెందిన యోగిత(22) అమ్మాయి ఫోటో చూశాడాయన. అమ్మాయి అందంగా ఉండటంతో యోగితా కుటుంబానికి పురమాయించాల్సిందిగా మ్యారేజ్ బ్రోకర్ కి సూచించాడు.

ఓ మంచి ముహుర్తంలో యోగితా-రాజ్ పుత్ కి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. యోగితా అనాథ, తల్లిదండ్రులు లేరు. అన్ని అన్నయ్య శివానందే. అయినా ఈడు-జోడు బాగుండటంతో పెళ్లికి అడ్డుచెప్పలేదు. ఘనంగా సెప్టెంబర్ 7న యోగిత-రాజ్ పుత్ లు చిరాగ్ లోని వరుడి సొంత ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో జంటగా మారారు. పెళ్లి హడావుడి పదిరోజులపాటు అలాగే కొనసాగింది. 17వ తేదీన పెద్ద షాక్ తగిలింది.

యోగిత, ఆమె అన్నయ్య ఇంట్లోని నగలతోసహా ఉడాయించారు. అయితే వారి మీద మొదటి నుంచి అనుమానంగా ఉన్న రాజ్ పుత్ మేనమామ వెంటనే పోలీసులను అప్రమత్తం చేయటంతో ఎక్కువ దూరం పారిపోక ముందే వారిని అరెస్ట్ చేయగలిగారు. రైల్వే స్టేషన్ లో వారిని అరెస్ట్ చేసి ఆపై విచారణ చేపట్టగా షాకిచ్చే విషయాలు తెలియజేశారు ఈ కిలాడీ అన్నాచెల్లెలు. గుజరాత్ తోపాటు పలు రాష్ట్రాల్లో పేక్ పెళ్లి రాకెట్ ను నడపుతున్నారంట. వారు చెప్పిన పెళ్లికొడుకుల జాబితాను చూసిన పోలీసులు విస్తూ పోయారు. ప్రస్తుతం అసలు సూత్రధారి పెళ్లిళ్ల ఏజెంట్ కోసం వెతుకుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Fake Marriage rocket  bride  arrested  

Other Articles