సహారా చీఫ్ వెల్ కమ్ బ్యాక్ టూ జైల్ | Sahara chief Subrata Roy set to go back to Tihar jail.

Sahara chief subrata roy set to go back to tihar jail

Sahara chief Subrata Roy Arrest Again, Sahara chief Subrata Roy Back to jail, Sahara chief Subrata Roy news, Sahara chief Subrata Roy to Tihar Jail, SC angry over Sahara Rai Parole extension, Sahara Chief Subrata rai Bail extension, Sahara Chief Surata Rai arrest, Subrata Roy back to jail

Sahara chief Subrata Roy set to go back to Tihar jail, SC angry over Parole extension.

‘సహారా’ రాయ్ బ్యాక్ టూ జైల్

Posted: 09/23/2016 11:26 AM IST
Sahara chief subrata roy set to go back to tihar jail

సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. పెరోల్ మీద బయట ఉన్న రాయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ బెయిల్ మీద బయట ఉన్న సుబ్రతా రాయ్ గడువు ముగియటంతో దానిని పొడిగించాలని రాయ్ తరపు న్యాయవాది కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. రాయ్ మీరు వెంటనే జైలుకి వచ్చేయండి అంటూ వ్యాఖ్యానించింది.

సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టిన వాళ్లను సెబీ నిబంధనలను ఉల్లంఘించి మోసం చేశారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 2014 మార్చి 4 లో ఆయన తీహార్ జైలుకి వెళ్లారు. కాగా, బెయిల్ ఇవ్వాలంటే రూ. 10 వేల కోట్లు కట్టాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో అప్పట్లో విదేశాల్లోని ఆస్తులను అమ్మేసి పెరోల్ తెచ్చుకున్నారు.

సుమారు రెండేళ్లపాటు తీహార్ జైళ్లో ఉన్న ఆయన ఆపై పెరోల్ తో బయటే ఉన్నారు. కాగా, ఎప్పటికప్పుడు బెయిల్ పొడిగించుకుంటూ వస్తూ, చివరికి జూలైలోనే ముగిసింది. దీంతో మరోసారి పొడిగించాలని రాయ్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఆయన ఆస్తుల చిట్టను చూసి సుప్రీం కోర్టు దిగ్భ్రాంతికి గురైంది. ఇంత ఆస్తి ఉన్న సుబ్రతా రాయ్ రెండేళ్ల పాటు తీహార్ జైల్లో ఎందుకు మగ్గాడని, తక్షణమే ఇన్వెస్టర్లకు డబ్బు చెల్లించాల్సిందేనని ఆదేశించింది. అతను చెల్లించాల్సిన మొత్తం, ఆయనకున్న ఆస్తితో పోలిస్తే అత్యంత స్వల్పమని సుప్రీం కోర్టు గుర్తించింది. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో పెరోల్‌ను ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సుబ్రతా రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన విజ్నప్తిని కోర్టు తోసిపుచ్చింది.

కాగా, ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 20,000 కోట్ల నిధుల చెల్లింపు వివాదంలో అరెస్టయిన సుబ్రతా రాయ్ తీహార్ జైలుకి వెళ్లోచ్చారు. రాయ్ తోపాటు, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు శిక్ష అనుభవించిన వారిలో ఉన్నారు. తాజా ఆదేశాలతో రాయ్ అరెస్ట్ ఖాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sahara Chief  Subrata Roy  Parole  Supreme Cort  Jail  Again  

Other Articles