మానవత్వంతో వ్యవహరించారు.. సంచలనంగా మారిపోయారు..! Making Way For AMBULANCE In Ganesh Visarjan Restores Humanity

Making way for ambulance in ganesh visarjan restores humanity

ambulance came in ganesh visarjan, ganesh visarjan in pune, making way for ambulance, making way for ambulance in ganesh visarjan, pune ganesh visarjan restores humanity, pune ganesh visarjan video, way for ambulance in ganesh immersion ceremony

What happens if an ambulance comes in the way where Ganesh immersion ceremony is going on. Especially in a city like Pune where there is a huge gathering for Ganesh visarjan. But this video restores our faith in humanity.

ITEMVIDEOS: మానవత్వంతో వ్యవహరించారు.. సంచలనంగా మారిపోయారు..!

Posted: 09/20/2016 09:29 PM IST
Making way for ambulance in ganesh visarjan restores humanity

దేశ రాజధాని ఢిల్లీలో మనిషి ప్రమాదానికి గురై రోడ్డుపై జీవన్మరణ పోరాటం మధ్య గంటలపాటు కొట్టుమిట్టాడినా.. పట్టించుకోని కఠినాత్ములు వుండగా, అదే ఆర్థిక రాజధాని ముంబాయి వున్న మహారాష్ట్రలో మాత్రం అందుకుపూర్తి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మేము మనుషులం, మాకు మానవత్వం వుంది.. ప్రాణం విలువ తెలుసు.. అని చాటారు పూణే వాసులు. వినాయక నిమజ్జన ఉత్సవం ముగిసిపోయినా.. అది చాటి చెప్పిన ఓ మానవీయ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో విశేషంగా చక్కెర్లు కొడుతోంది.

గణపతి నిమజ్జనం రోజున భారీ ఊరేగింపు మధ్య కాషాల జెండాలు, వస్త్రాలు ధరించిన భక్తులు, భజనపరులు డప్పుల దరువులకు గంతులేస్తుండగా, వారి చుట్టూ వేలాది మంది ప్రజలు ఇసుకకూడా రాలనంతగా కిక్కిర్సిపోయి ఉన్నప్పుడు అటుగుండా ఓ అంబులెన్స్‌ వచ్చింది. వేలమంది భక్తులు రోడ్డుపై నిలబడి వున్నారు. పది మంది వున్న రోడ్డుపై నుంచి అంబులెన్స్ వెళ్లాలంటేనే సమయం పడుతుంది. అలాంటిది రోడ్డుపై భక్తజనులు భజనల్లో నిమగ్నమైవుండగా అంబులెన్స్ వెళ్లడం సాధ్యమేనా..? కానీ కేవలం 40 సెకన్ల వ్యవధిలో అంబులెన్స్ వారిని దాటివెళ్లింది అదెలా అంటే..?

దానికి జన సముద్రం రెండుగా చీలిపోయి దారిచ్చింది. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేయగా, దీన్ని ఇప్పటికే పది లక్షల మందికిపైగా చూశారు. రెండు రోజుల్లో 40 వేల మందికిపైగా షేర్‌ చేసుకున్నారు. పుణెలో వినాయక నిమజ్జనం రోజున తీసిన ఈ రెండు నిమిషాల నిడివిగల వీడియో విదేశాల్లో వింతకాకపోవచ్చు. భారత్‌లాంటి దేశంలో, అందులోనూ వినాయక నిమజ్జనం రోజున ఇలాంటి మానవత్వాన్ని చాటిచెప్పే సంఘటనలు చాలా చాలా అరదు. దీంతో దేశరాజధాని ఢిల్లీ కన్నా పూణే చాలా నయమన్న భావన కూడా వెల్లువెత్తుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ganesh immersion  ganesh visarjan  pune  ambulence  crowd  humanity  

Other Articles