రైతన్నలతో ప్రధాని మోదీ ఒక్క సెల్పీ అయినా తీసుకున్నారా..? Narendra Modi has never taken selfie with a farmer: Rahul Gandhi

Pm narendra modi is selfie and promise making machine says rahul gandhi

congress, BJP, vice president rahul gandhi, PM modi, congress, BJP, rahul gandhi, Prime Minister Narendra Modi, selfie and promise-making machine, achhe din, 'Deoria to Dilli kisan yatra', RSS, PM Modi,Rahul Gandhi,Rahul Gandhi Kisan Yatra

Labelling PM Modi as a "selfie and promise-making machine", Rahul Gandhi said the promise of 'achhe din' is only meant for the PM's industrialist friends and not for the poor.

ఫీఠం ఎక్కింది అయనే కానీ.. పాలన మాత్రం వారిదే

Posted: 09/20/2016 12:10 PM IST
Pm narendra modi is selfie and promise making machine says rahul gandhi

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారంలో దియోరా టు ఢిల్లీ కిసాన్ యాత్రతో దూసుకుపోతున్న కాంగ్రెస్ యువనేత, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్రమోడీ సహా అర్ఎస్ఎస్ పై మరోమారు తనదైన శైలిలో విమర్శలను గుప్పించారు. నరేంద్రమోడీ ప్రధాన మంత్రి ఫీఠాన్ని అధిరోహించారని కానీ, పాలన మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (అరఎస్ఎస్)దే నడుస్తుందని అన్నారు. ప్రధానిని మెషిన్ తో రాహల్ అభివర్ణించారు. ప్రధాని మోడా సెల్పీలు తీసుకునే, హామీలను గుప్పించే యంత్రంగా అయన ఎద్దేవా చేశారు.

ప్రధాని చెప్పిన అచ్చేధిన్ దేశంలోని ఏ ఒక్క పేదవాడికి రాలేదని, అయితే మోడీ చెప్పిన శుభదినాలు మాత్రం ఆయన చుట్టూ కొటారీలో వుండే 10 నుంచి 15 మంది వ్యాపారవేత్త మిత్రులకు వచ్చాయని రాహుల్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికలకు ముందు విదేశాల్లోని నల్లడబ్బను తీసుకువచ్చి.. దానిని దేశప్రలకు అకౌంట్లలో 15 లక్షల రూపాయల డబ్బును వేస్తానని ఇచ్చిన హామీని రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు నెరవేర్చలేదని రాహుల్ ప్రశ్నించారు. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన హామీ కూడా గంగలో కలిపారని ఎద్దేవా చేశారు.

తన కిసాన్ యాత్రంలో మందిరాలను, మసీదులను పక్కపక్కనే వుండటం గమనించానని, ఇధి భారతీయ సంస్కృతీ సంప్రదాయమని, ఇదే భారతీయ భిన్నత్వంలోని ఏకత్వానికి నిదర్శనమని అన్నారు. అలాంటి మోడీ ప్రధాని కాగానే అన్నదమ్ముల మాదిరిగా సహృద్భావంతో కలసిమెలసివున్న భారతీయుల మధ్య చిచ్చుపెట్టారని రాహుల్ వ్యంగస్త్రాలు సంధించారు. తాము అధికారంలో వున్న పదేళ్ల కాలంలో ఏనాడు మతకలహాలు లేవని, అలాంటి మోడీ ప్రధాని కాగానే ప్రజల మధ్య విభేధాలు సృష్టించారని అరోపించారు.

హర్యానాలో జాట్, జాతేరతల మధ్య ఘర్షణాయుత వాతావరణాన్ని కల్పించిన ఘనత కూడా మోడీకే చెందుతుందని అరోపించారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు.. పేదలు, అన్నదాతల అర్థనాధాలు పెడచెవిన పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అరోపించారు. తన డియోరా సభలో రైతులు తమ మంచాలను ఎత్తుకెళ్లితే.. వారిని దొంగలంటూ పరిగణించడం బీజేపి నేతలకే చెందుతుందని రాహుల్ మండిపడ్డారు. అదే బీజేపి ప్రభుత్వ సహకారంతో పది వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో దేశాన్ని వదిలి వెళ్లిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యను మాత్రం కేవలం ఢీఫాల్టర్ అంటూ వెనకేసుకు రావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  BJP  rahul gandhi  PM modi  narendra modi  RSS  

Other Articles