అసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు, దర్శకుడు Prabhu Deva rushed to hospital due to back injury

Prabhu deva rushed to hospital due to back injury

Bollywood, Prabhudeva, Sonu Sood, Tamannaah Bhatia, injury, hospital, Tutak Tutak Tutiya, Prabhu Deva

Prabhu Dheva, who is a choreographer, actor, and director met with an accident and injured his back, while shooting in sonu sood debut tri lingual production tutuk tutak tutuiya.

అసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు, దర్శకుడు

Posted: 09/16/2016 07:38 AM IST
Prabhu deva rushed to hospital due to back injury

సినీ కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ను ప్రారంభించి.. యముకులే లేనట్లుగా డాన్స్ చేసి ఇండియన్ మైఖిల్ జాక్సన్ గా పేరుగాంచిన నటుడు, డ్యాన్సర్, దర్శకుడు ప్రభుదేవా షూటింగ్ లో గాయపడి ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాతో నటిస్తున్న త్రిబాష చిత్రం షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. నటుడు, విలన్ గా తెలుగు ఇండస్ట్రీలో బాగా రాణించిన సోనుసూద్ ఈ చిత్రంతో నిర్మాతగా కూడా పరిచయం కానున్నారు.

 తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అభినేత్రి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, 350 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. సోనూసూద్ సహా ప్రధాన తారాగణంపై చిత్రీకరిస్తున్న పాటకు ప్రభుదేవా నృత్యాలు కంపోజ్ చేస్తుండగా ఆయన ఒక్కసారిగా వెన్నునొప్పితో విలవిల్లాడిపోయారు.

దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కొన్ని రోజులపాటు ప్రభుకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్టు నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు. మూడు భాషల్లో రూపొందుతున్న అభినేత్రి చిత్రం తమిళంలో ‘దేవి’గా, హిందీలో ‘టూటక్ టూటక్ టుటియా’గా విడుదల కాబోతోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Prabhudeva  Sonu Sood  Tamannaah Bhatia  injury  hospital  Tutak Tutak Tutiya  Prabhu Deva  

Other Articles