బీజేపీ, టీడీపీలపై కాకినాడ సభలో పవన్ విసుర్లు | pawan speech at kakinada janasena sabha

Pawan speech at kakinada janasena sabha

pawan fire on BJP and TDP kakinada Sabha, pawan fire on BJP and TDP, pawan TDP and BJP

pawan fire on BJP and TDP kakinada janasena sabha.

ITEMVIDEOS: ఆత్మగౌరవ సభ హైలెట్స్ 2:కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే.. బీజేపీ పొట్టలో పొడిచింది

Posted: 09/09/2016 04:21 PM IST
Pawan speech at kakinada janasena sabha

మూడు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం వేచి చూస్తున్న ఆంధ్ర ప్రజల చేతుల్లో కేంద్రం లడ్డూలు పెట్టిందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా పదునైన మాటలతో, కేంద్ర వైఖరిపై తన తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. "అరే.. ఒక మూడు సంవత్సరాలుగా పాచిపోయిన లడ్డూలు ఎవడికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందరు లడ్డూలు బాగుంటాయి కదా? మా కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా? కావాలంటే చెప్పండి ఇస్తాం. తొలుత బీజేపీ నేత వెంకయ్యనాయుడును ఉద్దేశించి ప్రారంభమైన ప్రసంగం, ఆపై తెలుగుదేశంవైపు నడిచింది.

అవకాశవాదపు రాజకీయాల వల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. ఎవరూ..? ఒక్కరు కాదు, చాలా మంది కలిపి నాలుగు దశాబ్దాలకు పైగా మోసం చేసి చేసి చేసీ... ఈ రోజున మనమున్న ఈ పరిస్థితికి తీసుకువచ్చారు. అందుకే, మన హక్కుల కోసం పోరాటం చేయడానికి మనం కాకినాడకు వచ్చాం. అసలు బీజేపీ నాయకులకు ఎంత ధైర్యం? అరే, సీమాంధ్రకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ కు వచ్చి విడగొడతారా? అంత ధైర్యమా మీకు? ఏం మాకు పౌరుషం చచ్చిపోయిందా? పోరాట పటిమ తగ్గిందనుకుంటున్నారా?" అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ ప్రసంగం కొనసాగుతోంది.

"స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం అని చెప్పి ఊరించి ఊరించి త్వరలోనే తీపి కబురు అని ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎమ్మెల్యే, ప్రతి టీడీపీ ఎంపీలు చెబితే, నేనూ మీలాగే ఇస్తారేమో ఇస్తారేమో అని చూస్తుంటే... అదిగదిగో ఇచ్చారు లడ్డూలు చాలా మంచి లడ్డూలు. పాచి కంపు కొట్టే లడ్డూలు ఇచ్చారు. అయినా ఇన్ని కోట్ల మందికి వారిచ్చిన లడ్డూలు ఏం సరిపోతాయి. మన పాతిక మందికే సరిపోవు. వాళ్లే కొట్టుకుంటారు ఆ లడ్డూల కోసం" అంటూ లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నాడు.

తెలుగుదేశం ప్రభుత్వం, వారి నాయకులపై గౌరవం ఉందని, అది తగ్గలేదని చెప్పిన పవన్, తనకు వ్యక్తిగతంగా ఏపార్టీతోనూ విభేదాలు లేవని, ప్రజా సమస్యల విషయానికి వస్తే మాత్రం తాను విభేదిస్తానని స్పష్టం చేశాడు. ఇప్పుడు టీడీపీ సర్కారు ఆ పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటుందా? తీసుకోదా? అన్నదే మన ముందున్న ప్రశ్నని అన్నాడు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ వెన్నులో పొడిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుండా బీజేపీ ఏకంగా పొట్టలో పొడిచిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఉందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Kakinada  speech  TDP and BJP  

Other Articles