స్పీకర్ కు సారీ చెబుతూ రోజా లేఖ | Roja sorry to assembly for her Foul Comments

Roja sorry to assembly for her foul comments

MLA Roja sorry letter, Roja sorry to AP assembly, Roja sorry to speaker, MLA Roja Foul Comments, Roja suspension

MLA Roja sorry letter to assembly for her Foul Comments.

రోజా సారీతో వ్యవహారం ముగిసినట్లేనా?

Posted: 09/02/2016 10:37 AM IST
Roja sorry to assembly for her foul comments

నటి, ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎట్టకేలకు దిగొచ్చారు. కాల్ మనీ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సభా నాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై నిండు సభ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సారీ చెబితే వదిలేస్తామన్న సర్కారు ఫీలర్లకు ససేమిరా అన్న ఈ ఫైర్ బ్రాండ్ ఇంతకాలం న్యాయ పోరాటం చేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలో కూడా ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో చివరకు దిగివచ్చిన ఆమె సారీ చెప్పేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

అనుకున్నదే తడవుగా ఆమె సారీ చెప్పేశారంట. ఈ మేరకు లిఖితపూర్వకంగా రోజా రాసిన క్షమాపణ లేఖ నిన్న స్పీకర్ కార్యాలయానికి చేరిందని సమాచారం. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారంట. నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే... ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారని చెబుతున్నారు.

అయితే స్పీకరు అసెంబ్లీ మొదలయ్యేలోగా నిర్ణయం తీసుకుంటారా లేదా ఆ లేఖను విచారణ కమిటీకి పంపి సిఫారసు అడిగి కాస్త పొడిగిస్తారా అనేది వేచిచూడాలి. ఒకవేళ ఆమె లేఖను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ను తొలగిస్తే మాత్రం వచ్చే సమావేశాలల్లో ఆమె అధికార పక్షంపై చెలరేగిపోవటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Roja  Foul Comments  suspension  sorry letter  speaker  

Other Articles