'No work' in TS drove Nayeem to other States with other names

Nayeem drove to chattisgarh by changing his name as james

Gangster Nayeem, James, Chhattisgarh, SIT officials, nagireddy, bhongir, yadagirigutta, Driver fahimuddin, Shamshabad DCP sanpritsing, Fayaz, sama sanjeeva reddy, sri hari, Land grabbings, victims complaints, nayeem bedroom, nayeemuddin, sit, special investigation team, Telangana

Nayeem driver Fayyaz was taken by police to his residence at Roshan Nagar in Mailardevpally. Two bags full of land documents and a two-wheeler were recovered at Fayyaz`s residence.

ఛత్తీస్ గడ్ లోనికి చోచ్చుకెళ్లిన నయీమ్.. జేమ్స్ పేరుతో ఆగడాలు..

Posted: 08/26/2016 10:32 AM IST
Nayeem drove to chattisgarh by changing his name as james

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మరో పేరు కూడా ఉందా..? ఛత్తీస్‌గఢ్‌లో జేమ్స్ అనే పేరుతో నయీమ్ చలామణి అయ్యాడా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నా రు సిట్ అధికారులు. ఆడవేషాలు, బుర్ఖాలు, ముసుగులతో ఎప్పుడూ సంచరించే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బెదిరింపులు, భూ ఆక్రమణలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన నయీమ్ ఈ నెల 8న ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు నయీమ్‌కు జేమ్స్ అనే మరో పేరు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి నయీమ్‌ను ఉపయోగించుకోవాలని అక్కడి పోలీసులు భావించారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి అప్పుడే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు తెలిసింది.

ఇదిలావుండగా, నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిపై సిట్ నిఘా పెట్టింది. సిట్ అధికారులు భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్యవర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి.. డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
 
నయీమ్ అనుచరుడైన మరో డ్రైవర్ ఫయీముద్దీన్ అలియాస్ ఫయాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న నయీమ్ అల్లుడు ఫయీమ్ చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని రోషన్‌కాలనీలో నివాసముండే ఫయాజ్‌పై నిఘా వేసి శాతంరాయ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ఒక తపంచా, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రోషన్‌కాలనీలోని ఫయాజ్ ఇంటిపై దాడులు చేసిన పోలీసులు అతని భార్యతో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ద్విచక్రవాహనంతో పాటు రెండు స్పోర్ట్స్ బ్యాగుల్లో వందలాది భూ డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

గ్యాంగ్ స్టర్ నయీమ్ మరో అనుచరుడు సగ్గర హరి అనే వ్యక్తిని పోలీసులు భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసుకు తరలించారు. నయీమ్ బాధితుడు, ఎలక్ట్రానిక్స్ అండ్ సానిటరీ షాపు యజమాని సుంచు నరహరి ఫిర్యాదు మేరకు పోలీసులు హరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సగ్గర హరి కాకినాడకు చెందిన వ్యక్తి. గత కొంత కాలంగా భువనగిరిలో స్థిరపడిన ఇతను నయీం సెటిల్మెంట్‌లలో ఇతను కీలకవ్యక్తిగా భావిస్తున్నారు. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి నయీం ద్వారా సెటిల్మెంట్‌లు జరిపినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles