ఆరెస్సెస్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా రాహుల్ | Digvijay Singh says No U turn by Rahul Gandhi on RSS

Digvijay singh says no u turn by rahul gandhi on rss

Rahul Gandhi on RSS, RSS killing Gandhi, Rahul RSS controversy, Digvijay Rahlu on RSS marks, RSS Digvijay SIngh, Gandhi Assassination by RSS

Digvijay Singh says No U turn by Rahul Gandhi on RSS.

రాహుల్ యూ టర్నా? ఛాన్సే లేదంట

Posted: 08/25/2016 06:22 PM IST
Digvijay singh says no u turn by rahul gandhi on rss

ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉన్నారని, యూటర్న్ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకుని, క్షమాపణలు చెప్పాడని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు దిగ్విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలమే మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందన్న రాహుల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఆయనపై పరువునష్టం కేసు వేశారని అన్నారు.

ఇంకోవైపు ఆరెస్సెస్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశాడు. అయితే గాంధీని ఆరెస్సెస్ సంస్థ హత్య చేసిందని తాను నిందించలేదని, ఈ ఘాతుకం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులున్నారని మాత్రమే వ్యాఖ్యానిం చానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరించాడు. 2014 ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హత్యలో ఆరెస్సెస్ హస్తం ఉందని ఉపన్యసించాడు. దీనిపై ఆరెస్సెస్ పరువు నష్టం కేసు వేయగా, బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి.

దీనిపై విచారించిన ధర్మాసనం స్పందిస్తూ.. నిందితుడు గాంధీని ఆరెస్సెస్ హత్య చేసినట్లు వ్యాఖ్యానించలేదని, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చేసినట్లు అన్నారని భావిస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ సంతృప్తి చెందితే కేసును కొట్టివేస్తామని, లేకపోతే విచారణ ముందుకు వెళ్తుందని బెంచ్ తెలిపింది. ఈ కేసులో రాహుల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించడం విశేషం. ఇక ఆరెస్సెస్పై ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు హాజరవడం మంచిదేనని, ఆయన యూటర్న్ తీసుకున్నా అది మంచి టర్నే అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RSS  Digvijay Singh  Gandhi  Assassination  

Other Articles