50 మంది యువతుల అశ్లీల చిత్రాలు | Vrindavan girls Morphed photos viral in whatsapp

Vrindavan girls morphed photos viral in whatsapp

Morphed photos of Vrindavan girls, UP girls morphed photos, Vrindavan girls morphed photos, 50 girls obscene photos

Morphed photos of Vrindavan girls sent on WhatsApp, families go to cops.

ఆ ఫోటోలతో కాలేజీ గర్ల్స్ కాస్త కాల్ గర్ల్స్

Posted: 08/24/2016 06:33 PM IST
Vrindavan girls morphed photos viral in whatsapp

యూపీలో మహిళల జీవితం రాను రాను నరకం కుంపటిగా మారిపోతుంది. వరుసగా అత్యాచారాలు, నీలిచిత్రాల అమ్మకం లాంటి ఘోరాలు వింటున్న సమయంలో మరో దారుణం బయటపడింది. ప్రస్తుతం ఓ యాభై మంది విద్యార్థినులు నరకం అనుభవిస్తున్నారు. తమ అశ్లీల చిత్రాలంటూ ఆన్ లైన్ లో కొన్ని చక్కర్లు కొట్టడంతో అవమాన భారంతో కుంగిపోతున్నారు. ఆకతాయిల మార్ఫింగ్ జాడ్యానికి బలైన వారినగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే... బృందావనంలో కాలేజీలో చదివే వీరి ఫోటోలను దుండగులు మార్ఫ్ చేసి నగ్న దేహాలకు వీరి తలలను అతికించారు. అసభ్యకరమైన ఈ ఫోటోలను వాట్సాప్ ద్వారా వైరల్ చేస్తూ వీరిని కాల్ గర్ల్స్ గా ప్రచారం చేశారు. అందులో అమ్మాయిల పేర్లు, చిరునామా, ఫోన్ నంబర్లు కూడా ఉంచారు. ఈ విషయం పేరేంట్స్ దాకా వెళ్లటంతో అవమానంతో కుంగిపోతున్నారు. పిల్లలను చదువు మాన్పించి ఇంటికే పరిమితం చేశారు. మరికొందరు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా, ఇంతవరకు ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో బాధిత యువతుల కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి.

కాగా, గత ఏడాది నవంబర్ లోనూ ఇదే తరహాలో ఘటన పాట్నా, లక్నో కి చెందిన పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, ఆ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోటి చోటుచేసుకోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, సైబర్ క్రైమ్ సెల్ ద్వారా త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నగర ఎస్సీ అలోక్ ప్రియదర్శిని చెబుతున్నారు. కాగా, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని కనక ధార అనే ఎన్జీవో సంస్థ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని పీఎం, సీఎంలతోపాటు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని వారంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Vrindavan girls  morphed photos  

Other Articles