మయన్మార్ లో భూకంపం... భారత్ లోనూ ప్రభావం | Massive Earthquake of 6.8 magnitude strikes Myanmar, tremors in India Also.

Massive earthquake of 6 8 magnitude strikes myanmar

Massive Earthquake of 6.8 magnitude strikes Myanmar, tremors felt in parts of Mayanmar earthquake in India, India Earthquake, Vizag earthquake, Massive Earthquake in East and South east India

Massive Earthquake of 6.8 magnitude strikes Myanmar; tremors felt in parts of Bihar, West Bengal Odisha and Andhra Pradesh.

మయన్మార్ లో మళ్లీ భూకంపం... ప్రభావం విశాఖలో కూడా

Posted: 08/24/2016 04:46 PM IST
Massive earthquake of 6 8 magnitude strikes myanmar

మయన్మార్ ఈ భారీ భూకంపంతో వణికిపోయింది. ఈ ప్రభావంతో భారత్ లోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నంలో కూడా స్పష్టంగా కనిపించింది. మయన్మార్ లోని చౌక్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా ఉంది.

భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, మంగళవారం ఉదయం కూడా మయన్మార్ లో స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఉదయం గం. 7.11 నిమిషాలకు రిక్టల్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5 గా నమోదైంది. భూకంపం  అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఉదయం గం. 5.30 నిమిషాలకు రిక్టల్ స్కేలుపై 3.1 తీవ్రతతో తేలికపాటి ప్రకంపనలు సంభవించినట్లు ఐఎండి వెల్లడించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం అధికారికంగా నమోదు కాలేదని భారత మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండి) ధృవీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayanmar  Earthquake  India  tremors  Vizag  

Other Articles