పరువు నష్టం దావాలపై జయకు సుప్రీం వార్నింగ్ | Jayalalithaa slammed by Supreme Court on defamation cases

Jayalalithaa slammed by supreme court on defamation cases

As Public Figure, Learn To Take Criticism, Jayalalithaa slammed by Supreme Court, Jayalalithaa defamation cases, SC on Jayalalithaa's defamation cases

Jayalalithaa slammed by Supreme Court on defamation cases. Bench says As Public Figure, Learn To Take Criticism

అమ్మను ఆ మాత్రం తిట్టడంలో తప్పేం లేదంట

Posted: 08/24/2016 01:32 PM IST
Jayalalithaa slammed by supreme court on defamation cases

తమిళనాడు ముఖ్యమంత్రిగా అలుపెరగకుండా సాగుతున్న అమ్మ జయలలిత రాజకీయ ప్రస్థానంపై వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆమె పాలనపై చాలాసార్లు ప్రతిపక్ష డీఎంకే విరుచుకుపడటం వందల సార్లు చూసి ఉంటాం. ఈ క్రమంలో ఆమెపై వారు చాలా సార్లు ఘాటైన పదజాలమే వాడారు. అయితే ఐదేళ్ల పాలనలో తనపై విపక్షంపై చేసిన ఆరోపణలపై 150కి పైగా పరువు నష్టం దావా కేసులను ఆమె న్యాయస్థానంలో వేశారు. దీంతో సుప్రీం కోర్టు ఆమెకు తలంటింది.

సద్విమర్శలను ఎదుర్కోవడంలో తప్పులేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జయలలితకు తలంటింది. అయినా రాజకీయాల్లో విమర్శలు అంతర్భాగమన్న విషయం తెలియదా? అంటూ కూడా కోర్టు జయ వైఖరిని నిలదీసింది. అనవసరంగా ప్రజా ధనంతోపాటు, కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని, విమర్శలు సహేతుకం కాని సమయంలో తమను సంప్రదించాలని కోర్టు ఆమె తరపు న్యాయవాదికి సూచించింది.

కాగా, తనపై పరుష పదజాలంతో కూడిన విమర్శలు చేశారంటూ విపక్ష డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయించిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం జయలలిత... నిన్న కరుణానిధికి సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ ఆమె విసిరిన సవాల్ కు కరుణానిధి నుంచి ఇప్పటిదాకా సమాధానమే లేదు. ఈ నేపథ్యంలో జయలలిత వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఈ రసవత్తర రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  CM Jayalalithaa  defamation cases  Supreme Court  

Other Articles