'What if I spit on Sindhu': Malayalam director's FB post sparks outrage

Sanalkumar sasidharan s post about sindhu was sarcasm

PV Sindhu, Sanal Kumar Sasidharan, PV Sindhu felicitation, Rio Olympics 2016, India at Rio

Director of award-winning Malayalam film Ozhivu Divasathe Kali, Sanal Kumar Sasidharan, has been facing severe criticism ever since he posted something extremely weird about India's Olympic Silver medalist PV Sindhu's feat.

పీవీ సింధూపై అనుచిత వ్యాఖ్యలు.. నెట్ జనుల మండిపాటు..

Posted: 08/24/2016 06:28 AM IST
Sanalkumar sasidharan s post about sindhu was sarcasm

రియో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్  బ్యాడ్మింటన్ ఈవెంట్ లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్న సమయంలో మరో దర్శకుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇప్పటికే ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభా డే సింధూను తక్కువ చేసి ట్విట్ చేయడం దూమారాన్ని రేకెత్తించడంతో అమె తన తప్పును తెలుసుకుని దిద్దుకున్నారు. కాగా అమె బాటలోనే మరో దర్శకుడు పయనించి విమర్శలపాలయ్యాడు.

దేశంలోని సగటు క్రీడాభిమాని నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరూ తెలుగుతేజం సాధించిన రజత పతకాన్ని స్వాగతిస్తూ అమెను వేనోళ్ల పోగడతూ అభినందించారు. కాగా మలయాళీ అవార్డు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఫేస్బుక్లో సింధు విజయాన్ని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. 'సింధు విజయాన్ని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు.

శశిధరన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు వివిధ రాష్ట్రాలు, క్రీడా సంఘాలు, పలువురు వ్యక్తులు భారీ పారితోషకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం సింధు, కోచ్ గోపీచంద్లను ఘనంగా సన్మానించాయి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malayalam film director  Sanal Kumar Sasidharan  PV Sindhu's feat  Rio Olympics  

Other Articles