810 కోట్లు ఖర్చుపెట్టి సాధించింది ఏంటీ? | India spent 810 crores in four years on players for Rio olympics

India spent 810 crores in four years on players for rio olympics

India spent 810 crores in four years, India spent 810 crores for Rio, INDIA Britain olympics spend analysis, Britain better than India Rio Results

India spent 810 crores in four years on players for Rio olympics, but, UK spent 3 thosand crores got 61 medals.

నాలుగేళ్లు.. 810 కోట్లు... రెండు పతకాలు

Posted: 08/23/2016 05:33 PM IST
India spent 810 crores in four years on players for rio olympics

ఒలంపిక్స్ సంబరం ముగిసిన వేళ భారత ఆటగాళ్ల సామర్థ్యం పై అనాలసిస్ మొదలైంది. మొత్తం 209 దేశాలు ఈ క్రీడా సంబరంలో పాల్గొనగా, కేవలం రెండంటే రెండు పతకాలతో బారత్ 67వ స్థానంలో నిలిచింది. ఇందు కోసం గత నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం చేసిన సొమ్ము అక్షరాల 810 కోట్ల రూపాయలంటే ఆశ్చర్యం కలగక మానదు.

క్రీడా మంత్రిత్వ శాఖ సాలీనా బడ్జెట్ లో 3,200 కోట్లు పొందుతుంది. రియో ఒలంపిక్స్ కోసం శిక్షణా సెంటర్లు, కోచ్ లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 750 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు చేయగా, నేషనల్ స్పోర్ట్స్ డెవలెప్ మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ద్వారా 38 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో మొత్తం ఒలంపిక్స్ క్రీడల కోసం నాలుగేళ్ల కాలంలో భారత ప్రభుత్వం 810.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంత ఖర్చు చేస్తే భారత్ కు వచ్చిన పతకాలు కేవలం రెండంటే రెండే.

ఇదే సమయంలో ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న బ్రిటన్ విషయాన్ని పరిశీలిద్దాం. క్రీడలపై ఏడాదికి 9వేల కోట్లు బ్రిటన్ ఖర్చుచేస్తుండగా, ఈ నాలుగేళ్లలో ఖర్చుచేసింది 3,082 కోట్ల రూపాయలు. ఇంత ఖర్చును మెడల్స్ గా మార్చేందుకు ఆటగాళ్లు చాలానే కృషి చేశారు. మొత్తం 67 పతకాలు సాధించి పట్టికలో ద్వితియ స్థానంలో నిలిపారు. ఈ లెక్కన సగటున ఒక్కో పతకం కోసం ఆ దేశం 41 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నమాట.

ఇన్ని పతకాలు తెచ్చినా బ్రిటన్ వాసులు సంతోషపడడం లేదు. వీరికి పతకాల సాధన పేరుతో చేసిన ఖర్చు ట్యాక్స్ పేయర్లపై ఎంతపడిందో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుడు ఒక్కొక్కరు ఒలింపిక్స్ లో పోటీ పడ్డ క్రీడాకారులపై ఏడాదికి 1,090 రూపాయలు వెచ్చించినట్టు చెబుతోంది. యూకేలో 18 నుంచి 35 వయసు లోపు వారు 18 మిలియన్ జనాభా ఉండగా, భారత్ లో ఆ సంఖ్య 400 మిలియన్ గా ఉంది. క్రీడల్లో పాల్గొనేందుకు యూకే నుంచి పాల్గొంది వందలోపు మాత్రమే. అదే సమయంలో భారత్ మాత్రం 107 మంది ఆటగాళ్లతో బరిలో దిగింది. ఓవరాల్ గా ఒక పతకం కోసం 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  810 crores  rio olympics  Britain  top  

Other Articles