Photo of bikini-clad Swedish policewoman Mikaela Kellner arresting thief goes viral

Bikini clad swedish cop makes arrest while sunbathing

Bikini Clad Swedish Policewoman 'Stops Thief',Bikini-clad Swedish policewoman 'stops thief',Bikini-clad Swedish policewoman 'stops thief',Bikini-clad policewoman takes down and arrests unlucky pickpocket,Bikini-clad Swedish cop makes arrest while sunbathing,Mikaela Kellner, swedish policewoman, swedish cop, Bikini-clad Swedish policewoman Mikaela Kellner,

A bikini-clad Swedish police officer has been praised for tackling a suspected thief while she was off-duty sunbathing with friends in Stockholm.Bikini clad policewoman takes down and arrests unlucky pickpocket in Sweden

ITEMVIDEOS: బికినీలో పోలీస్ అధికారి డ్యూటీ.. అధికారుల ప్రశంసలు

Posted: 07/30/2016 01:01 PM IST
Bikini clad swedish cop makes arrest while sunbathing

పులి పరద్యానంలో వుంది కాదా అని ఫోటోలు దిగితే పర్వాలేదు.. కానీ దానిపై స్వారీ చేయాలనుకుంటే.. ఎంతటి ప్రమాదమో తెలుగు సినిమా హీరో డైలాగులతో మనకు అర్థమవుతుంది. అయితే పులి లాంటి ఓ ఓ పోలీస్ ఆఫీసర్ వున్న పార్కులోకి వచ్చి.. అమె స్నేహితురాలికి చెందిన వస్తువును కాజేసిన దొంగకు ఈ విషయం నిదానంగా అర్ధైంది. అన్ డ్యూటీలో వున్నా ఆఫ్ డ్యూటిలో వున్నా..  యూనిఫాంలో వున్నా.. బికినీలో వున్నా.. పులి పులే. డ్యూటి డ్యూటీనే అంటూ దొంగ అట కట్టించిన లేడీ అఫీసర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే అమె ఫోటోలకు పది వేలకు మించిన లైకులు లభించాయి. అమె డ్యూటీలో లేదుగా ఏం చేస్తుందిలే అనుకు్న దొంగకు పట్టపగలే చుక్కలు కనింపించేలా చేసింది. అమె తీసుకున్న చర్యల నేపథ్యంలో అమెపై ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. అఫ్ డ్యూటీలో అందులోనూ బికినీలో వుండి కూడా అమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఉన్నతాధికారుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తాయి.

వివరాల్లోకి వెళ్తే.. స్వీడిష్ పోలీస్ ఆఫీసర్ మైఖేల్ కెల్నర్ తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవల స్టాక్హోంలోని ఓ పార్క్కు వెళ్లింది. అక్కడ బికినిలో సన్బాత్ ఎంజాయ్ చేస్తూ సేదతీరుతోంది. ఆ సమయంలో వారి వద్దకు న్యూస్ పేపర్ అమ్మేవ్యక్తినంటూ ఓ వ్యక్తి వచ్చాడు. అతడు వెళ్లిన తరువాత గమనిస్తే.. కెల్నర్ మిత్రురాలి ఫోన్ మిస్సయింది. దీంతో ఒక్కసారిగా దొంగ వైపు పరిగెత్తిన కెల్నర్ అతడిని పట్టుకొని నేలపై పడేసి అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బికినిలో ఉండి కూడా డ్యూటీ నిర్వహించిన కెల్నర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కెల్నర్ మాత్రం.. 'ఆ సమయంలో నేను నగ్నంగా ఉన్నా అదేపని చేసేదాన్ని' అంటూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mikaela Kellner  swedish policewoman  swedish cop  Bikini-clad  Stockholm park  mobile phone  

Other Articles