police booked murder case on mp spy reddy daughter sujala

Murder case on mp daughter in andhra pradesh

sujala, spy reddy, nandyala, kurnool, andhra pradesh, murder, Nandi Academy International School, PRO madam suman, MP SPY reddy daughter sujala, Nandi group companies, crime

Murder case has been booked on Nandyala MP SPY Reddy's daughter Sujala in Nandi Academy International School PRO madam suman by police

హత్యకేసులో ఎంపీ కూతురిపై కేసు..

Posted: 07/30/2016 11:18 AM IST
Murder case on mp daughter in andhra pradesh

పాఠశాల పీఆర్వో హత్య కేసులో ఓ పార్లమెంటు సభ్యుడి కూతరిపై హత్యకేసు నమోదైన విషయం సంచలనం రేపుతుంది. పేరుకు ప్రజాప్రతినిధుల అవతారం ఎత్తి, వారి వారసులు, బంధువులతో వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఓటు వేసి గెలిపించిన అదే ప్రజలపైనే పెత్తనం చెలాయిస్తూ.. అవసరమైన నేపథ్యంలో దారుణాలకు కూడా ఒడిగడుతున్నారని ఇప్పటికే అనేక విమర్శలు తెరపైకి వస్తున్న తరుణంలో సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.

మనిషన్నవాడు మాయమై, మానవత్వమన్నది మచ్చకైనా లేకుండా పోతున్న ఈ సభ్యసమాజంలో అన్నింటికీ నడిపిస్తున్నది మాత్రం డబ్బే. విద్యార్థులకు సబుద్దులు నేర్పించి వారిని ప్రయోజకుల్ని చేసి, ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు.. వాటి యాజమాన్యాలు కూడా కేవలం డబ్బే తమకు పరమావధి అని, అందుకోసం ఎంతవరకైనా తెగిస్తామని చెప్పకనే చెబుతున్నది ఈ ఘటన. పేరుకు ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డులు పెడితే సరిపోదు.. యాజమాన్యాలు కూడా అందుకు అనుగూణంగా వ్యవహరిస్తేనేగా పాఠశాలలు విద్యార్థులకు విద్యాబోదన నిలయాలుగా మారేంది. ఇలా చేస్తే అ పాఠశాల విద్యార్థలకు కూడా కొదవుండదు.

అందుకు భిన్నంగా తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు పీఆర్వో వ్యవస్థ అందుబాటులోకి రాగానే.. వారు కేవలం మాటల మాంత్రికులుగా నిలుస్తున్నారు. వారు చెప్పదానికి, వాస్తవిక పరిస్థితులకు చాలా వత్యాసమే వుంటుంది. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులను మస్కా కోట్టేంచే టాలెంట్ వున్నవారినే పాఠశాలలు చేర్చుకుంటాయి. అయితే ఇలాంటి పీఆర్వోలకు ముందస్తుగానే యాజమాన్యాలు కొంత డబ్బు చెల్లిస్తాయి. ఆ తరువాత టార్గెట్ ను బట్టి మరింత డబ్బును అందజేస్తుంటాయి. నంది అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులను చేర్పించేందుకు యాజమాన్యంతో పీఆర్ఓ మేడం సుమంత్ అగ్రిమెంట్ కుదుర్చుకుని కొంత మొత్తాన్ని తీసుకున్నాడు.

అయితే సుమంత్ ఇచ్చిన టార్గెట్ కార్యరూపం దాల్చకపోవడంతో.. అతనికి అడ్వాన్సు రూపంలో ఇచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని పీఆర్వో సుమంత్ పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సుమంత్ ను యాజమాన్యం పాఠశాలలోనే నిర్భంధించింది. విషయం తెలుసుకున్న సుమంత్ సోదరుడు సునీల్ ఆ రోజు రాత్రి పాఠశాలకు వెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా మరుసటి రోజు తెల్లవారుజామున యాజమాన్యానికి చెందిన మురళీ, షఫీ అనే వ్యక్తులు ఫోన్ చేసి సుమంత్ అనారోగ్యంతో ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

సోదరుడు సునీల్, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా సుమంత్ శవమై కనిపించాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో తమ సోదరుడ్ని మురళి, షఫీ దారుణంగా హింసించారని, వారి దెబ్బలకు తట్టుకోలేక తమ సోదరడు మరణించాడని, వారిపై హత్య కేసు నమోదు చేయాలని సుమంత్ సోదరుడు సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి కుమార్తె, నంది గ్రూప్స్ డైరెక్టర్ సుజలపై హత్య కేసు నమోదు చేశామని రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో సుజలతో పాటు షఫి, మురళీపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sujala  spy reddy  nandyala  kurnool  andhra pradesh  murder  crime  

Other Articles