ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇటుకలు ఎత్తుకెళ్తున్నారు | China to crack down on brick-by-brick theft of Great Wall

China to crack down on brick by brick theft of great wall

brick theft of Great Wall of China, China wall robbery, The Great Wall of China, China wall disappear, The Great Wall of China vanish,

China to crack down on brick-by-brick theft of Great Wall

గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఎత్తుకెళ్లిపోతున్నారు

Posted: 07/29/2016 06:31 PM IST
China to crack down on brick by brick theft of great wall

ప్రపంచ వింతల్లో ఒకటి, చైనా పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది 21 వేల కిలోమీట‌ర్ల పొడుగు అతి పెద్ద దిగ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రస్తుతం ఇది కనుమరుగు అయ్యే స్థితికి చేరిపోతుందట. ఇప్పటికే 30 శాతం గొడ మాయమయి పోవటం చైనా ప్రభుత్వాన్ని కలవరుపాటుకు గురిచేస్తోంది. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు అనుకుంటే పొరపాటే. మరి ఏంటంటారా? దొంగల బారిన పడి ఇది క్రమంగా కనిపించకుండా పోతుందని తెలుస్తోంది.

ఓవైపు శిథిలంగా మారుతున్న ఈ గొడను రక్షించుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు గోడలో ఉన్న రాళ్లను, ఇటుకలను దొంగిలించి ఇళ్లకు వాడుకోవటంతోపాటు, ఎక్కువ రేటుకు విదేశీ పర్యాటకులకు అమ్మేస్తున్నారంట. ఇది స్థానికంగా ఉండే యువకుల పనేనని అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి చైనా గోడ‌లో కొంత భాగం ధ్వంసం చేసి మరీ, ఆ దృశ్యాల‌ను వీడియో తీసి మ‌రీ ఆన్‌లైన్‌లో పెట్టాడు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

పూర్తి నిఘాతో దొంగ‌ల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. గోడ వివ‌రాల‌ను తెలియ‌జేసేందుకు హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు, గోడ పొడుగునా గ‌ట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. క్రీ.పూ మొద‌లు పెట్టిన ఈ గోడ నిర్మాణాన్ని మింగ్ రాజుల(1368-1644) పాల‌న వ‌ర‌కు అంచెలంచెలుగా నిర్మించిన సంగతి తెలిసిందే. శత్ర దేశాల దాడుల నుంచి, మంచు కొండల నుంచి వీచే బలమైన చల్లని గాలులను అడ్డుకునేందుకు చైనా చక్రవర్తులు దీనిని నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Great Wall  bricks  robbery  protection  

Other Articles