సీఎం కేసీఆర్ పై నారా లోకేష్ సెటైర్లు | nara lokesh satire on KCR farm house ruling

Nara lokesh satire on kcr farm house ruling

Nara Lokesh satire on KCR, KCR farm house ruling, Lokesh about KCR farm house, TTDP Nara Lokesh

TDP secretary nara lokesh satire on KCR farm house ruling.

చినబాబు సెటైర్: ఫాంహౌజ్ లో పండుకుంటే పనులు కావు

Posted: 07/29/2016 10:32 AM IST
Nara lokesh satire on kcr farm house ruling

తెలంగాణలో పార్టీని పునాదులతోసహా మళ్లీ పైకి లేపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాగానే కృషి చేస్తున్నాడు. వీకెండ్ లలో కార్యకర్తలతో సిట్టింగ్ వేయటంతోపాటు, అడపా దడపా తెలుగుదేశం భవన్ ఖాళీగా ఉంచకుండ చర్చలు నిర్వహించడం, స్పీచ్ ల మధ్యలో అక్కడక్కడా తెలంగాణ యాసను వాడుతూ హడావుడి చేస్తున్నాడు. గురువారం ఈ మధ్య మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేశాడు.

ఈ సందర్భంగా తెలంగాణ పాలనపై, ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజధానిలో ఉండి పాలన చూసుకోవాలే గానీ, ఫాంహౌస్ లో పడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆరోపించాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కష్టపడి పాలన సాగించాలని చెబుతూ.... ఫాంహౌస్ పాలన కారణంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయిందంటూ విమర్శించాడు.

గడచిన 45 రోజుల పాలన చూస్తుంటే... కేసీఆర్ ను సొంత పార్టీ నేతలే నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని లోకేశ్ ఆరోపించారు. తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని, అప్పుడు కేసీఆర్ అధికార మదం మొత్తం దిగిపోతుందని అన్నాడు. కేవలం ట్విట్టర్ వేదికగా ఇంతకాలం విరుచుకుపడిన నారా లోకేష్ నేరుగా ఇలా కామెంట్ చేసే పరిస్థితికి చేరటం కాస్త ఇబ్బందికర పరిణామమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP  nara lokesh  CM KCR  farm house  

Other Articles