Medical aspirants, parents crestfallen as Eamcet—III looms

Telangana cm set to decide fate of eamcet 2 exam today

cid, Rajgopal Reddy, main conspirator, Telangana minister, C. Laxma Reddy, TS EAMCET-2 paper leak, Usha Education Bengaluru, Eamcet-II Paper Leak, Eamcet-II Paper, Telangana Eamcet-II Paper, Telangana Eamcet-II

The twists and turns in Eamcet-II leakage and the fear of exam being cancelled is sending several rankers into a state of dejection.

ఎంసెట్ రద్దుపై విద్యార్థుల తలోదారి.. నేడు తేల్చనున్న ప్రభుత్వం..

Posted: 07/29/2016 10:10 AM IST
Telangana cm set to decide fate of eamcet 2 exam today

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్టుతో దీని ద్వారా సుమారుగా 70 మంది విద్యార్ధులు లభ్ది పోందారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పరీక్షను నిబంధలన మేరకు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్న సమాచారంతో విద్యార్థి లోకం తర్జనభర్జనలు పడుతుంది. వైద్య విద్య సహా దాని అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం తాము ఒకే ఏడాది ఎన్ని పర్యాయాలు మనోవేదనకు గురుకావాలని రాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్షలు నిర్వహిస్తారని అది నుంచి అందుకోసం ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఈ ఏడాది నీట్ నుంచి మినహాయింపు కల్పించడంతో రెండో ధఫా ఎంసెట్ 2 పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షా ప్రతాలు కాస్తా లీక్ గ్యాంగ్ చేతిలో పడటంతో.. మరలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు జారీ చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి రాసిన పరీక్షలలో ర్యాంకులు సాధించగా, ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు. మళ్లీ పరీక్ష పెట్టినా.. తాము తీవ్రఅసహనంతో పరీక్షలలో మెరుగైన ర్యాంకులు సాధించలేవమని భాధను వ్యక్తం చేస్తున్నారు.

‘మెడిసిన్‌లో సీటు మా కల. అందుకోసం చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు వదులుకుని చదువుకున్నాం. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్, ఎంసెట్-2 రాశాం. కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ అంటే అదీ రాశాం. ఎంసెట్-2లో మెరిట్ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో చేరుదామనుకుంటే.. లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామంటే మా గతేం కావాలి. ఇప్పటికి 5 పరీక్షలు రాశాం. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్‌లు రాసే శక్తి మాకు లేదు..’.. ఎంసెట్-2 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎంసెట్ 2 పై ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని, నిబంధలన ప్రకారం పరీక్షలను రద్దు చేసే నిర్ణయానికే అయన కట్టుబడి వున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cid  CM KCR  Rajgopal Reddy  TS EAMCET-2 paper leak  Usha Education Bengaluru  

Other Articles