విజయ్ కాంత్, భార్య ప్రేమలత అరెస్ట్ | Court issues arrest warrant against Vijayakanth wife Premalatha

Court issues arrest warrant against vijayakanth wife premalatha

DMDK Vijayakanth wife Premalatha arrest, Vijayjanth court arrest warrant, arrest warrant to hero and wife

Court issues arrest warrant against DMDK Vijayakanth wife Premalatha.

విజయ్ కాంత్ అరెస్ట్ కు రంగం సిద్ధం

Posted: 07/27/2016 11:16 AM IST
Court issues arrest warrant against vijayakanth wife premalatha

ప్రముఖ నటుడు విజయ్ కాంత్, సతీమణి సహా అరెస్ట్ చేయాలని తమిళనాడులోని ఓ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన నేతృత్వం వహిస్తున్న డీఎండీకే వర్గాల్లో గుబులు పుడుతోంది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై విచారణకు రానందుకు కోర్టు వారెంట్ ను జారీ చేసింది.

గతంలో అమ్మను టార్గెట్ చేస్తూ, విజయ్ కాంత్ ఆయన భార్య ప్రేమ లత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా, కోర్టు అరెస్ట్ వారెంట్ సిద్ధం చేసింది. అయితే సమన్లు జారీ చేసినప్పటికీ, విజయకాంత్ దంపతులు వాటిని ఖాతరు చేయలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది.

పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేకపోవడంతో తమ నేతలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళన డీఎండీకే వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రంలోని పలు కోర్టుల్లో వీరిద్దరిపైనా పరువు నష్టం దావా కేసులు విచారణ దశలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMDK  vijaykanth  premalatha  jayalalitha  court  arrest warrant  

Other Articles