Farmer marries rape survivor, joins fight for justice

Farmer marries rape survivor joins fight for justice

Jitender Chhatar, Farmer, marriage, rape survivor, Chhatar village, Jind district, fight for justice, law course, Haryana CM ML khattar, Haryana,gang rapes, honour killings, skewed sex ratio,

Jitender Chhatar, a resident of Chhatar village of Jind, is happily married to the survivor since December 4, 2015. Jitender not only married the woman but also joined her in the fight for justice

అమెకు జీవితాన్నిచ్చి.. అదర్శప్రాయుడయ్యాడు

Posted: 07/27/2016 10:20 AM IST
Farmer marries rape survivor joins fight for justice

ఆడవారిపై నిత్యం అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లకు పాల్పడతున్న మగ మృగాళ్లు తోడేళ్లలా కాచుకూర్చున్న తరునంలో పైశాచిక మృగాళ్ల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఓ యువ రైతు. జింద్ జిల్లాకు చెందిన యువరైతు ఒకరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి కొత్త జీవితం ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా న్యాయపోరాటానికి దన్నుగా నిలిచాడు. లాయర్ కావాలన్న ఆమె ఆకాంక్షను నెరవేర్చేందుకు తనవంతు మద్దతు అందించాడు.

జింద్ జిల్లాలోని ఛాతర్ గ్రామానికి చెందిన జితేందర్(29) గతేడాది డిసెంబర్ 4న సామూహిక అత్యాచార బాధితురాలిని పెళ్లాడాడు. తన భార్య చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలిచాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఒక దుండగుడి అరెస్ట్ కోసం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యం చేసుకోవాలని అతడు కోరుతున్నాడు. తన భార్యకు నైతిక మద్దతు అందిస్తూనే ఆమె చదువుకోవడానికి సాయమందిస్తున్నాడు.

'నా భార్య న్యాయవిద్య చదవాలనుకుంటోంది. లాయర్ కావాలన్నది తన లక్ష్యం. అత్యాచార బాధితులకు అండగా నిలవాలనుకుంటోంది. లైంగిక వేధింపుల బాధితుల తరపున పోరాటానికి ఇప్పటికే యూత్ ఎగెనెస్ట్ రేప్ అనే సంస్థను ఏర్పాటు చేశామ'ని జితేందర్ తెలిపాడు. తన భర్త అందిస్తున్న సహాయంతో తన లక్ష్యాలను సాధించగలనన్న విశ్వాసాన్ని జితేందర్ భార్య వ్యక్తం చేసింది. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు అండదండలు అందిస్తున్న జితేందర్ ను ఆదర్శప్రాయుడిగా జనమంతా కొనియాడుతున్నారు. ఇలాంటి పుణ్యమూర్తులు, ఆదర్శ ప్రాయులు మరికోందరు బాధితులకు అపన్నహస్తాన్ని అందించి అదుకోవాల్సిన అవసరముందన్ని కూడా కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles