police overaction: three year old spends 35 days in jail

Three year old spends 35 days behind bars in madurai

three-year-old boy accused, three yr old boy in jail, 3 year old in jail, 3 yr old theft case accused, 3 year old madurai police, 3 year old madras high court, 3 year old mother, Kuravar community, Madurai central prison, 3 year old father, 3 year old uncle, 3 year old aunt, 3 year old in jail for 35 days, 3 year old in theft case, 3 year old reunited with mother

A three-year-old boy of Kuravar community, who was languishing in Madurai central prison along with his father, uncle and aunt for 35 days in a theft case, was reunited with his mother.

35 రోజులు జైలు జీవితం అనుభవించిన మూడేళ్ల చిన్నారి

Posted: 07/26/2016 05:22 PM IST
Three year old spends 35 days behind bars in madurai

పోలీసుల తమ అదుపాజ్ఞల్లో వుండే చిన్న నేరగాళ్లపై మాత్రం అతి చేస్తారు. అదే పెద్ద హోదా వెలగబెట్టి.. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న నేరగాళ్లకు మాత్రం సలామ్ లు చేసి ఎంతో కొంత చేయి తడిస్తే చాలనుకుంటారు. రెక్కాడితే కాని డొక్కాడని కష్టజీవులు పూటగడవక ఏదైనా చిన్న వస్తువు దొంగలించగానే కటకటాల వెనక్కి నెడతారు. ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల నుంచి రుణాలను పొంది కోటాను కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగట్టి పోయిన అర్థిక నేరగాళ్ల చెంతకు వెళ్లాలంటేనే జంకుతారు. అచ్చంగా ఇలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. పోలీసులు ఓవరాక్షన్ కారణంగా మూడేళ్ల పసివాడు కటకటా రుచి చూశాడు.

ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 35 రోజుల పాటు దొంగతనం కేసులో జైలు జీవితాన్ని అనుభవించాడు. అభం శుభం తెలియని పసిప్రాయంలో పోలీసులు అతికారణంగా జైలు జీవితం అనుభవించిన ఆ పసివాడి హృదయం ఎంత మనోవేధనకు గురైవుంటుందని అన్న విషయాన్ని కూడా అలోచించకుండా, పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని మధురై ప్రాంతంలో చోటు చేసుకుంది. మదురై సమీపంలోని నల్లూరులో ఓ జాతర వద్ద బొమ్మలు అమ్ముకుంటుండగా.. మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగతనం చేశారంటూ బాలుడి తండ్రి, అత్తయ్య, మామయ్యలను తమ వెంట తీసుకెళ్తూ ఆ పసివాణ్ని కూడా లాక్కెళ్లారు. ఆ బాలుడు తన కొడుకని, వాణ్ని తీసుకెళ్లొద్దని ఆ పిల్లాడి తల్లి మేరీ ఎంత మొత్తుకున్నా వారు మాట వినలేదు.

వీరిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ విషయం తెలుసుకున్న మేరీ తన కొడుకును తనకు అప్పగించాలని న్యాయస్థానానికి మొర పెట్టుకుంది. కానీ ఆ న్యాయమూర్తి మిగతా ముగ్గురితోపాటు ఆ పిల్లాడికి కూడా జ్యుడీషియల్ కస్టడీ విధించారు. దీంతో ఆమె మదురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. దీంతో పోలీసులు ఆ బాలుణ్ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. తల్లి సంరక్షణ లేకుండా బాలుణ్ని జైలుకు ఎందుకు పంపారంటూ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుణ్ని అరెస్టు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. ఆ పసివాణ్ని తల్లి దగ్గరకు చేర్చిన న్యాయస్థానం.. బాలుడికి రిమాండ్ విధించిన జడ్జి నుంచి వివరణ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 3 year old boy  accused  theft case  madurai central prison  madras high court  

Other Articles