Female collector makes security guard hold chappals while river-crossing, gets trolled online!

Guard holds ias officers slipper

ias shoes, social media, kanker district, chattisgarh, security guard holds ias slippers, young ias oficers, photo wnt viral on social media, IAS Shammi Abidi, kanker district collector Shammi Abidi

A young IAS officer Shammi Abidi, collector of Kanker district in Chhattisgarh, has become a subject for social media ridicule with a picture purportedly showing her security guard carrying her slippers while crossing the river.

సెక్యూరిటీ చేతిలో కలెక్టర్ చెప్పులు.. యువ ఐఎఎస్ పై విమర్శలు

Posted: 07/26/2016 08:16 AM IST
Guard holds ias officers slipper

గత కన్ని నెలల క్రితం మహారాష్ట్ర మంత్రి వార్తల్లో నిలిచిన మాదిరిగానే ఇప్పుడు ఛత్తిస్ గడ్ కలెక్టర్ కూడా పలు పత్రికలలో పతాక శీర్షకలకు అవకాశం కల్పించారు. అదేటంటే..  యువ కలెక్టర్ గారి చెప్పులను పక్కనున్న సెక్యూరిటీ గార్డులు మేయడమే. ఈ వ్యవహారం ఇప్పుడు ఛత్తీస్‌ఘడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. కన్కెర్ జిల్లా కలెక్టర్ అయిన షమ్మీ అబిది తన సెక్యూరిటీ గాడ్ చేత చెప్పుల మోయించారు. ఇప్పుడది సోషల్ మీడియాలో పెద్ద చర్చ కింద మారిపోయింది. పలువురు ఆమెను తిట్టిపోస్తున్నారు. ఎంత కలెక్టర్ అయితే మాత్రం ఇలా చెప్పులు మోయిస్తారా ! అంటూ కన్నెర్ర చేస్తున్నారు.
 
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు షమ్మీ అబిది. అయితే ఆ ప్రాంతానికి వెళ్లేందుకు అనికట్ డాంను దాటే క్రమంలో కొటారి నది దాటాలి, బురదలో నడవాల్సి ఉంటుంది. అక్కడి అధికారులతో పాటు, ప్రజలు కూడా ఆమె వద్దకు వచ్చారు. వరద ప్రాంతాలను సందర్శించడానికి ఇంత కష్టపడి మరీ ధైర్యంగా వచ్చిందని అందరూ గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇంతలోనే అంతకు మించి చెడ్డగా చెప్పుకుంటున్నారు.
 
ఆ సమయంలో ఆమెను చూడగానే ఒక్కసారిగా అక్కడి వారందరూ షాకయ్యారు. ఆమె వనకనే ఉన్న సెక్యూరిటీ గాడ్ చేతిలో అతని చెప్పులతో పాటు ఆమె చెప్పులున్నాయి. దీంతో అందరూ ఆమె తీరుపై గుసగుసలాడుకున్నారు. అందులో ఒకరు ఫొటో తీసి నెట్‌లో పెట్టగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలెక్టర్ అయితే మాత్రం ఇలా చేస్తారా ! అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడిన సదరు కలెక్టర్ బురదగా ఉండటంతో తన చెప్పులను పైలెట్ వాహనంలో వదిలేసానని చెప్పారు. కానీ సెక్యూరిటీ గార్డ్ వాటిని తన వెనకనే మోసుకొస్తున్న విషయం తెలియదని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ias shoes  social media  kanker district  chattisgarh  security guard  viral news  

Other Articles