ఫ్లోరిడాలో నైట్ క్లబ్ పై కాల్పులు... ఇద్దరు మృతి | At least two dead and 16 wounded in florida night club attack

At least two dead and 16 wounded in florida night club attack

florida night club attack, Fortmyers night club attack, gun fire at night club

gun attack on Fortmyers night club in Florida 2 died and 16 injured.

ఫ్లోరిడాలో నైట్ క్లబ్ పై కాల్పులు... ఇద్దరు మృతి

Posted: 07/25/2016 03:15 PM IST
At least two dead and 16 wounded in florida night club attack

అమెరికాలో మరోసారి తూటా పేలింది. వరసగా కాల్పుల ఘటనలతో బెంబేలెత్తిపోతోన్న ఆ దేశంలో సోమవారం మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడాలోని నైట్ క్లబ్‌లోకి ఒక్క‌సారిగా దూసుకొచ్చిన ఓ దుండ‌గుడు త‌న వ‌ద్ద ఉన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. దీంతో ఇద్ద‌రు మృతి చెంద‌గా, మ‌రో 16 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఫ్లోరిడా ఫోర్ట్‌ మెయర్స్‌లోని ‘క్లబ్‌ బ్లూ’లో ‘టీన్ నైట్’ పార్టీ జరిగింది. సాయుధులైన అగంతకులు నైట్‌ క్లబ్బులోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.దుండ‌గుడి బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి చాలామంది క్ల‌బ్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాల్పుల‌తో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మృతిచెందిన ఇద్దరిలో ఒకరు 14 ఏళ్ల బాలుడు .  ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని,  కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అంతమొందించేందుకు  ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

నైట్ క్లబ్ పార్టీకి హాజరైన వారిలో అంతా 13 నుంచి 15 ఏళ్లలోపు బాలురే ఉన్నారు. దీంతో పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు అర్థమౌతోంది. గతనెలలో ఆర్లాండోలోని గే నైట్‌ క్లబ్బులో ఓ ఉన్మాది కాల్పులు జరిపి.. 50మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.  ఆ దాడి తర్వాత భద్రత కట్టుదిట్టం చేసినప్పటికీ తాజాగా మరోదాడి చోటుచేసుకోవం గమనార్హం.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Florida  Fortmyers night club attack  kill  

Other Articles