Tiger kills woman visiting Beijing safari park after she exits car

Tiger kills woman visiting beijing safari park after she exits car

Tiger kills woman visiting Beijing safari park after she exits car, tiger kills woman, tiger kills woman in beijing, safari park tragedy in beijing, woman killed by tiger, wildlife park in Beijing, beijing safari park, woman beijing, Badaling Safari World, freely roaming lions and tigers

Tigers killed a woman and severely injured a second when they left their vehicle at a wildlife park in Beijing, mainland media reports.

ITEMVIDEOS: దిగరాని చోట కారు దిగింది.. కాలయముడి పంజాకు..

Posted: 07/25/2016 09:29 AM IST
Tiger kills woman visiting beijing safari park after she exits car

ప్రమాదం పోంచి వుందని సూచికలను ఏ ప్రమాదం వస్తుందిలే అని నిర్లక్ష్యం చేసే వారు లేకపోలేదు. ప్రమాదకరమైన మలుపు అని అధికారులు సూచికలు పెట్టినా నిర్లక్ష్య వైఖరితో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడినవారు లేకపోలేదు. చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అనే స్థాయికి వచ్చేశారు అధికారులు. ప్రమాదం ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో అంచనా వేయడంలో విఫలమవుతాం. అనూహ్యంగా వచ్చే ప్రమాదాల బారిన పడటం కంటే.. సూచికలను అనుసరించి వెళ్లడమే మంచిది కదా. ఇప్పుడీ విషయం చైనాలోని ఓ కుటుంబానికి తెలిసివచ్చింది.

సరిగ్గా చైనాలోని కూడా ఇదే జరిగింది. చైనా రాజధాని బీజింగ్ కు చేరువలోని బడాలింగ్ వన్య ప్రాణి పార్కులో వాహనాలు దిగరాదు అన్న సూచికలు దర్శనమిస్తున్నాయి. అయినా తమ ముందు వెనుక కార్లు వున్నాయన్న దైర్యంతో కారు దిగిన ఓ మహిళకు ప్రమాదం బారిన పడింది. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తోంది ఓ మహిళ. కారు ఆపి డ్రైవింగ్ చేసే వైపు నుంచి మారడానికి దిగి మరో డోర్ తెరిచింది అంతే ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. కారులోంచి ఎవరు దిగుతారా..? ఎవర్ని ఎత్తుకెళ్దామా అని పోంచి వున్న పులి.. కారు దిగిన మహిళను టార్గెట్ గా చేసకుంది.

అంతే క్షణాల్లో అక్కడికి చేరి ఆ మహిళను ఎత్తుకెళ్లి చంపి తినేసింది. కాపాడేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది. చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్‌‌కు సమీపంలోని సఫారీ పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా ఆ మహిళ కారు ఆపిన ప్రదేశం వన్యప్రాణులుండే ప్రదేశం. అయితే చుట్టుపక్కలా కార్లున్నాయి..తిరుగుతున్నాయి. పార్క్ నుంచి పులి ఎలా తప్పించుకుందన్న విషయం అక్కడి పార్క్ సిబ్బంది, అధికారులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger  woman  Beijing safari park  car  Badaling Safari World  china  

Other Articles