3 journalists from China's Xinhua told to leave India

3 journalists from china s xinhua told to leave india

China, Chinese journalists, India, India-China relations, Masood Azhar, Ministry of Home Affairs, Pakistam, Tibetans, Xinhua News Agency

India has reportedly decided to expel three Chinese journalists working with Xinhua news agency following "concerns" flagged by intelligence agencies.

..అందుకని చైనా జర్నలిస్టులపై దేశ బహిష్కరణ

Posted: 07/24/2016 08:59 AM IST
3 journalists from china s xinhua told to leave india

చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ 'జిన్హువా' తరఫున ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు చైనా సీనియర్ జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లాలని ఇండియా ఆదేశించింది. జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని గత వారంలో ఆదేశాలు జారీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 'జిన్హువా' బ్యూరో చీఫ్ వూ క్వియాంగ్, ముంబైలోని రిపోర్టర్లు లూ తాంగ్, షీ యోగ్యాంగ్‌లు నిషేధిత ప్రాంతాలను సందర్శించి అక్కడి సమాచారాన్ని సేకరించడం వంటి పనులు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

భారత్ లోని నిషిద్ద ప్రాంతాలకు వెళ్లడం, అక్కడి సమాచారాన్ని సేకరించడం చైనా జర్నలిస్టులకు కొత్తమీ కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు గాను చైనా జర్నలిస్టులకు ఇండియా దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోయింది. అయితే వూ క్వియాంగ్ ఆరేళ్లకు వీసా పొడిగించుకున్నాడని, అతని ఇద్దరు సహచరులు కూడా వీసా పొడిగించుకుని ఇండియాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. కాగా, విలేకరుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  india  chinese journalists  home ministry  xinhua news agency  

Other Articles