కృష్ణా నదీలో డెవిల్ ఫిష్ | devil fish in Krishna river during pushkaras time

Devil fish in krishna river during pushkaras time

devil fish in Krishna river, krishna river pushkaras, Krishna Pushkaralu, Devil fish Fishermen injured, Krishna River Devil Fish

Devil Fish enters into Krishna River during Pushkaras time. Fishermen injured by devil fish in Krishna River.

కృష్ణమ్మను షేక్ చేస్తున్న డేంజరస్ ఫిష్

Posted: 07/23/2016 12:04 PM IST
Devil fish in krishna river during pushkaras time

పవిత్ర కృష్ణా నదికి పుష్కరాలు  పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఇంకోవైపు నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు మోసుకొచ్చిన ఓ వార్త  ఆందోళన కలిగిస్తోంది. పిడుగు లాంటి ఈ వార్త అటు పుష్కర పనుల్లోని అధికార యంత్రాంగంతో పాటు ఇటు పుష్కరాలకు తరలివచ్చేందుకు సిద్ధపడుతున్న భక్తులను హడలెత్తిస్తోంది.

కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం డెవిల్ ఫిష్ దర్శనమిస్తోందట. శరీరం నిండా ముళ్లతో  ఉండే ఈ రాకాసి చేప మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది. సదరు డెవిల్ ఫిష్ ల సంఖ్య ప్రస్తుతం వేల సంఖ్యలో నది నీటిలో దర్శనమిస్తున్నాయట. మత్స్యకారుల వలలను చీల్చి పారేయడమే కాకుండా జాలర్లను గాయాలపాలు చేస్తున్నాయంట. దీంతో నదిలోకి చేపల వేటకు వెళ్లాంటేనే  బెంబేలెత్తిపోతున్నారు.

అయినా నిన్నటిదాకా కృష్ణా నదిలో కనిపించని ఈ డెవిల్ ఫిష్ ఇప్పుడెలా వచ్చాయా అని ఆరాలు తీస్తున్నారు.  పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిశాయి. ఈ నీటి ద్వారానే డెవిల్ ఫిష్ కృష్ణా నదీ జలాల్లోకి ప్రవేశించి ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరాలు దగ్గరపడుతుండటంతో వీటి బారిన పడకుండా భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devil fish  Krishna River  Pushkaralu  fishermen  injure  

Other Articles