Rape was there since earth's creation: Haryana BJP women cell chief

Bjp leader courts controversy over rape remark

Haryana gang-rape, gang-rape, rape, Nirmal Bairagi, BJP's State Women's cell head, Rapes Happening Forever, BJP women leader courts controversy over rape remark,

Bairagi claimed the state government took such incidents seriously and all necessary steps have been taken to curb them.

హవ్వ..! బీజేపి మహిళా నేత నిస్సిగ్గు వ్యాఖ్యలు..

Posted: 07/23/2016 11:04 AM IST
Bjp leader courts controversy over rape remark

భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అంటూ విపక్షాలు విమర్శలు సంధిస్తుండగా.. అఅప్రతిష్ట నుంచి పార్టీని కాపాడుకునేందుకు పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలోనే హర్యానాలో దళిత యువతిపై జరిగిన రెండు పర్యాయాలు సామూహిక అత్యచారం జరిగిన నేపథ్యంలో దానిపై స్పందిస్తూ ఆ రాష్ట్ర బిజెపి మహిళా నేత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలిపై నిందితులు మరోసారి అత్యాచారానికి తెగబడటం కలకలం రేపుతుండగా, అత్యాచారాలపై అమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

గత రెండేళ్లుగా అత్యాచార ఘటనలు రాష్ట్రంలో పెరుగుకు పోతున్నాయని విలేకరులు అడిన ప్రశ్నకు సమాధానంగా అమె దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మరోలా చెప్పాలంటే మనషి పుట్టినప్పటి నుంచి రేప్ అన్ని యుగాలలోనూ, అన్ని కాలలలోనూ జరగుతున్నాయని అమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహ్ తక్ గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మరోమారు అదే నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటనలో పురోగతిపై ప్రశ్నించిన పాత్రికేయులకు సమాధానమిస్తూ నిర్మల్ బైరాగి ఈ వాఖ్యలు చేశారు.

అత్యాచర ఘటనపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, అయితే నిందితులను పట్టుకునేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెరుగ్గానే పనిచేస్తున్నదని అమె ప్రభుత్వాన్ని వెనకేసుకోచ్చారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ నిందితులైన వారు అదే అకృత్యానికి ఒడిగట్టినా.. వారిని అరెస్టు చేయడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పడంలోనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిందెవరో ఓ సాధారణ నేత కాదని. ఏకంగా హర్యానా బీజేపి మహిళా విభాగం అధ్యక్షురాలు. మహిళగా వుంటూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సమర్ధించేట్టుగా వ్యాఖ్యనించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana gang-rape  gang-rape  rape  Nirmal Bairagi  BJP controversy  

Other Articles