Pregnant or otherwise, it’s not easy to stay with a woman: Harbhajan Singh

Harbhajan singh talks about pregnant wife geeta basra and fatherhood

Harbhajan Singh, Team india spinner, Geeta Basra, Pregnant, Sourav Ganguly, ms dhoni, MS Dhoni fans, ms dhoni india, india ms dhoni, india west indies, sportrs news, sports, cricket news, cricket

I’ve always been a responsible man when it comes to family... And with the baby, that would only grow. It’s a new chapter, I am looking forward to it.

పెళ్లై ఏడాది కూడా కాకుండానే భజ్జీ వైరాగ్యం..

Posted: 07/12/2016 04:54 PM IST
Harbhajan singh talks about pregnant wife geeta basra and fatherhood

ముచ్చటగా మూడుముళ్లేసి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే జీవిత సత్యాన్ని చెప్పేస్తున్నాడు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్. మూడు పదుల వయస్సులో అరు పదల అనుభవాలు చెబుతున్నాడు. అదేంటంటారా..? అదేంటి అంటారా..? జీవితంలో శృంగారంతో నిండాల్సిన వయస్సులో వైరాగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆడాళ్లతో వేగడం కష్టమేనని భజ్జీ సరదాగా వ్యాఖ్యానించాడు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. 'గర్భంతో ఉన్నా లేదా మామూలుగా ఉన్న ఆడాళ్లతో సమయం గడపడం చాలా కష్టమ'ని పేర్కొన్నాడు. ఆలుమగల మధ్య సదావగాహన ఉంటే సంసారం సాఫీగా సాగిపోతుందని కూడా అన్నాడు.

హర్భజన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నానని 36 ఏళ్ల భజ్జీ తెలిపాడు. గీత(32)ను గతేడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నాడు. పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు. తన బిడ్డ ఇంగ్లండ్ లో పుడుతుందని చెప్పాడు. గీత బ్రిటీష్ పౌరురాలని, ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని చెప్పాడు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harbhajan Singh  Team india spinner  Geeta Basra  Pregnant  Cricket  

Other Articles