ఆప్ ఎమ్మెల్యేలకి ఆడాళ్ల పిచ్చి ఎక్కువా? |Another AAP MLA arrested in sexual harassment

Another aap mla arrested in sexual harassment

AAP MLA Prakash Jarwal, AAP MLA misbehave with woman, MLA allegedly misbehaving with a woman

Another AAP MLA arrested in sexual harassment.Prakash Jarwal has been arrested for allegedly misbehaving with a woman

ఆప్ ఎమ్మెల్యేలకి ఆడాళ్ల పిచ్చి ఎక్కువా?

Posted: 07/08/2016 10:50 AM IST
Another aap mla arrested in sexual harassment

ఢిల్లీ అధికార పక్షం ఆప్ కి మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద తలనొప్పిగా మారగా, తాజాగా కేసులతో వరుసగా ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ యువ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేయటం కలకలం రేపుతోంది.

దియోలీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ పై గ్రేటర్ కైలాశ్ పోలీసు స్టేషన్ లో వేధింపుల కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడబోయాడంటూ ఓ మహిళపై చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్లు 354, 506, 509 మరియు 34 లను అనుసరించి ఆయన్ను అరెస్ట్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.

కాగా, గతంలో(2014లో) ఓ మహిళా అధికారిపై చెయ్యి చేసుకుని ఓసారి అరెస్టయిన ప్రకాశ్ మరోసారి ఏకంగా లైంగికదాడి ఆరోపణతో అరెస్టవ్వటం విశేషం. అన్నట్లు ఈ మధ్య ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియా సైతం మహిళలను దుర్భాషలాడటంతోపాటు వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ ఎన్నికల్లో తమ చేతుల్లో చావుదెబ్బ తప్పదనే బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆప్ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Delhi  MLA prakash Jarwal  

Other Articles