Adorable video shows moment a tiny kitten makes a break for freedom but ends up next to a puppy

Kitten escapes pet store enclosure to visit puppy

cat, dog, pet store, Taipei, Taiwan, fairytale-like, No barriers can stop true love, Jo Linn Pet House, Taiwanese pet store, pet store in Taipei, Taiwan, pets “fairytale-like” clip, kitten “broke barriers”, puppy friendship, pets friendship video 1.1 million views, pets friendship video12,000 likes and reactions, pets friendship video 18,600 shares. viral video, trending video

It's hard to know whether this kitten was trying to escape from a pet store in Taipei, Taiwan, or looking to meet up with his canine friend, but they both ended up together anyway.

ITEMVIDEOS: వైరల్ వీడియో: నిజమైన స్నేహానికి నిర్వచణం.. అదుర్స్..!

Posted: 06/30/2016 07:47 PM IST
Kitten escapes pet store enclosure to visit puppy

వివేకం, జ్ఞానం, అలోచించే తత్వం అన్ని వున్న మనుషుల మధ్యే సన్నిహిత సంబంధాలు చెడిపోతున్నాయి. వారి మధ్య స్వార్థం, అసూయ, అహంకారం ఇత్యాదులు వారి సన్నిహితానికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. అయితే పుట్టుకతోనే జాతి వైరం వల్ల బద్ధశత్రువులైన జంతువులు మాత్రం వారి మధ్య సన్నిహిత సంబంధాలను పెంచుకుంటున్నాయి. జాతి వైరాన్ని మర్చి కలగలసి తిరుగుతున్నాయి. ఒక్కటిగా కలసి జీవిస్తున్నాయి. మనుషుల కన్నా మేమే నయం అన్న సందేశాన్ని ఇస్తున్నాయి.

అది ఎంత గాఢంగా అంటే తమ ముందున్న ఎలాంటి సమస్యనైనా అధిగమించి శత్రువనుకున్నవారిని మిత్రువుగా మార్చుకునేంత. జాతి వైరం వల్ల ఇప్పటి వరకు కుక్క, పిల్లిని చూడగానే గట్టిగా అరచి, చరచి వేస్తుంది. అంతే ఆ అరుపుకు శునకానికి దోరకకుండా పరుగు లంకించుకోవడం పిల్లి వంతవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా అవి ఒక్కదాని తో మరోకటి అడుకునేందుకు పడిన తపన వర్ణించతరం కానిది. ఈ అంశానికి తైపీలోని ఓ పెంపుడు జంతువుల ఇల్లు సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దాదాపు 14లక్షలమందికి పైగా ఈ వీడియోను చూశారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా.. తైవాన్ లోని తైపీ నగరంలోగల జోలిన్ పెట్ హౌజ్లో ఓ బుజ్జి కుక్క పిల్ల(జై)ను, మరో బుజ్జి పిల్లి(వీరు)ని వేర్వేరు గ్లాస్ నిర్మాణాల్లో పెట్టారు. అవి పైకి ఎక్కి పారిపోలేనంత పకడ్బందీగా ఏర్పాటుచేశారు. పక్కపక్కనే ఉన్న జైకి, వీరుకి స్నేహం కుదిరింది. కానీ, అస్సలు కలుసుకోలేవు. ఎందుకంటే మధ్యలో గ్లాస్ అడ్డు. అప్పుడప్పుడు నిద్రలోకి వెళ్లే అవి కాస్త మెలకువ వచ్చినప్పుడు మాత్రం ఒకదానిని ఒకటి చూసుకుంటూ మురిసిపోతుండేవి.

ఒక రోజు బుజ్జి జై చిన్న కునుకు తీస్తుండగా తెలివైన వీరు మ్యావ్ అని అరుస్తూ గ్లాస్ గోడపైకి ఎక్కేసింది. వాస్తవానికి అక్కడి నుంచి అది పారిపోవచ్చు.. అయితే అప్పటికే నిద్రపోతున్న తన స్నేహితుడు జై నిద్ర లేచాడు. వెంటనే తన స్నేహితుడిని ఆహ్వానిస్తూ తన ముందు కాళ్లు అందించాడు. ఒక్కసారిగా మిత్రుడి స్పర్ష తగలడంతో మరింత కష్టపడి జైతో కలిసిపోయింది వీరు. ఇన్ని రోజులు పక్కపక్కనే ఉన్నా.. దూరమైన తన స్నేహితుడు తన పక్కకే వచ్చేసరికి బుజ్జి కుక్కపిల్ల సంతోషంతో తోకను ఊపుతూ ప్రేమగా తన మిత్రుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అదెలాగో ఆ వీడియోను మీరే చూడండి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cat  dog  pet store  Taipei  Taiwan  fairytale-like  viral video  

Other Articles