మంటలతో మేల్కొన్న ముంబై... 8 మంది మృతి | 8 killed in Andheri fire mishap

8 killed in andheri fire mishap

Andheri West fire mishap, 8 killed in andheri fire accident, latest news, mumbai fire accident

At least eight people were killed and one seriously injured after a fire broke out around 6 am at Wafa Medical Store at Juhu Galli in Andheri West.

ITEMVIDEOS:మంటలతో మేల్కొన్న ముంబై... 8 మంది మృతి

Posted: 06/30/2016 10:25 AM IST
8 killed in andheri fire mishap

ముంబైలో గురువారం ఘోర అగ్రిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఉదయం 6.30 గంటల సమయంలో అంధేరి ప్రాంతంలో ఓ మెడికల్ షాపు భవనంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

 

మొదట గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆపై ఫస్ట్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ భవనంలోని మిగతా వారిని ఖాళీ చేయించారు. షార్ట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

కాగా, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ ఈ నెల 3వ తేదీన సరిగ్గా ఇలాంటి ప్రమాదమే సంభవించింది. అయినా రక్షణ చర్యలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  andheri west  fire mishap  

Other Articles