భాగ్యనగరంలో భారీ ఉగ్రకుట్ర... భగ్నం | NIA arrests 5 suspected IS recruits in hyderabad

Nia arrests 5 suspected is recruits in hyderabad

NIA, hyderabad, IS recruits in hyderabad, IS recruits arrested in hyderabad, hyderabad terror alert

NIA arrests 5 suspected IS recruits in hyderabad.

భాగ్యనగరంలో భారీ ఉగ్రకుట్ర... భగ్నం

Posted: 06/29/2016 09:24 AM IST
Nia arrests 5 suspected is recruits in hyderabad

కరుడుగట్టిన ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ హైదరాబాద్ పై కన్నేసిందా? అవుననే అంటున్నాయి ఇంటలిజెన్స్ వర్గాలు. టూరిస్ట్ ప్రాంతాలతోపాటు రద్దీ ప్రదేశాల్లో భారీ ఎత్తున్న నరమేథం సృష్టించేందుకు పన్నాగ పన్నింది. ఉగ్రవాదులు ప్రవేశించారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ ఓల్ట్ సిటీ సహా పలుప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. 24 గంటల్లో 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ చాకచక్యంగా వీరిని పట్టుకోగలిగింది. కాగా, భాగ్యనగరంలో భారీ కుట్రకు పన్నాగం పన్నిందన్న వార్త తెలియగానే నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరోవైపు నగర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్ర నరమేథం నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NIA  hyderabad  IS recruits  

Other Articles