500 కోట్లు మింగేసిన కెప్టెన్? | makkal dmdk chief alleges vijayakanth mis use 500 crores party fund

Makkal dmdk chief alleges vijayakanth misuse 500 crores party fund

makkal dmdk chief, DMDK Vijaykanth, Vijaykanth party fund, latest news, Tamilnadu politics, vijayakanth mis use 500 crores party fund, పార్టీ ఫండ్ నొక్కేసిన కెప్టెన్, కెప్టెన్ 500 కోట్లు, విజయ్ కాంత్ 500 కోట్లు, తాజా వార్తలు

makkal dmdk chief alleges vijayakanth mis use 500 crores party fund

500 కోట్లు మింగేసిన కెప్టెన్?

Posted: 06/28/2016 03:04 PM IST
Makkal dmdk chief alleges vijayakanth misuse 500 crores party fund

మెగాస్టార్ చిరంజీవితోపాటు సమకాలీనంగా రాజకీయాల్లో అడుగుపెట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్. అయితే చిరు అడుగు తడబడితే కెప్టెన్ మాత్రం ఆటైంలో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అధికారంలోకి రాకపోయినా కనీసం ప్రతిపక్ష నేతగా నిలవటంతో నిజంగా గ్రేట్ అనుకున్నారంతా. అయితే నోటి దురద, పొత్తులపై స్పష్టత లేకపోవటం లాంటి పరిణామాలను జీర్ణించుకోలేని అభిమానులు ఆయన్ను కిందకి లాగిపడేశారు.

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన జనాల్లోకి రావాలంటేనే సిగ్గుతో చచ్చిపోతున్నారు. అయితే మొన్నటిదాకా వెన్నంటి ఉన్న అనుచరులు మాత్రం ఆయన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కూటమిలో విజయ్ కాంత్ చేరటాన్ని వ్యతిరేకిస్తూ చంద్రకుమార్ అనే కీలకనేత పార్టీకి రాజీనామా చేశారు. ఆపై మక్కల్ డీఎండీకే అనే పేరుతో పార్టీ పెట్టి డీఎంకే తో పొత్తు కలిశారు. ఇప్పుడు ఏకంగా దాన్ని డీఎంకే లో కలిపేశారు.

ఈ సందర్భంగా ఆయన విజయ్ కాంత్ పై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ పేరిట 500 కోట్లు వసూల్ చేసి దాన్ని మింగేశారంటూ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. జిల్లాల వారీగా 27 లక్షల చొప్పున మొత్తం 500 కోట్లు వసూలు అయ్యాయని, ఈ సొమ్మంతా పార్టీ అభివృద్ధి కోసం, సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తామని చెప్పి మోసం చేశారని చెబుతున్నాడు. ఈ స్కాంలో ఆయన భార్య ప్రేమలత, ఆమె సోదరుడు సుదీష్ హస్తం ఉందని కూడా ఆరోపించాడు. నిన్నటి దాకా వెన్నంటి ఉన్న అనుచరుడి దగ్గరి నుంచే ఇలాంటి నిందలు రావటంతో ప్రస్తుతం కెప్టెన్ పరిస్థితి కష్టతరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : makkal dmdk chief  vijayakanth  party fund  

Other Articles