woman activist gives a kiss to CM in public meeting

Cm gets a kiss from woman in a public programme

Karnataka CM, Siddaramaiah, Woman kisses CM in Public, Karnataka, Chikmagalur, congress, girija srinivas, karnataka, CM Siddaramaiah, viral video, kissing video, trending video

A woman had kissed CM Siddaramaiah and this incident has happened before the followers of Siddaramaiah during his felicitation ceremony.

ITEMVIDEOS: ముఖ్యమంత్రికి పబ్లిక్ గా ముద్దుపెట్టిన సర్పంచ్..

Posted: 06/26/2016 03:25 PM IST
Cm gets a kiss from woman in a public programme

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఊహించని పరిణామాన్ని ఎదుర్కోన్నారు. ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గోన్న ఆయనకు ఓ మహిళా కార్యకర్త ఏకంగా బుగ్గలపై ముద్దును బహుమతిగా ఇచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా అవ్వాకయ్యారు. అయితే ఆ మహిళా కార్యకర్త చేసిన పనిని పబ్లిక్ గా ఏమి అనలేక ముఖ్యమంత్రి కిమ్మనకుండా వుండిపోవాల్సి వచ్చింది. సదరు మహిళా కార్యకర్తను సిద్దరామయ్య ఏమైనా అనివుంటూ ఈ పాటికి మహిళా సంఘాలు పెద్ద రచ్చ చేసేవాని, ఆయన సంయమనం పాటించడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో కురుబా సామాజిక వర్గం ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగింది. సీఎం సిద్ధరామయ్య కురుబా కులానికి చెందినవారు కావడంతో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్‌మగ్‌లూరు జిల్లా తారికెర్ తాలూకా పంచాయతీ సభ్యురాలైన గిరిజా శ్రీనివాస్‌ను ఆయన సన్మానించారు. సన్మానం ముగిసిన వెంటనే ఆమె ఆయన కుడిబుగ్గపై ముద్దుపెట్టారు. దీంతో సిద్ధరామయ్య కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు.

ఈ ఘటనపై ఆయన స్పందించేలోగా ఆమె వేదిక నుంచి దిగిపోయారు. అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ 'సిద్ధరామయ్య నా తండ్రిలాంటివారు. ఆయనను నేను తొలిసారి కలిశాను. ఆ సంతోషంలో ఆయనకు ముద్దుపెట్టాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు' అని చెప్పారు. తనది సిద్ధరామయ్య నియోజకవర్గమేనని, తనకు పెళ్లి అయిందని ఆమె తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles