Video of five girls riding a bike doing hul-chul on web

Five girls ride one motorbike video hulchul on internet

motorbike, Overload, Five girls ride one motorbike, south China, Hezhou city, viral video, four minors, motor bike, five girls, traffic police, china, china roads, wet roads, bike riding, bike feat, traffic police, heze city of china, underage, minors, driving license, viral video, video hul-chul

A video of five girls, one of them sitting in reverse position on the front wheel, riding a bike on Chinese slippery roads went viral on social media.

ITEMVIDEOS: అమ్మో..! వీళ్లు అమ్మాయిలేనా..?

Posted: 06/26/2016 10:10 AM IST
Five girls ride one motorbike video hulchul on internet

పోకిరి అబ్బాయిలు అప్పడప్పుడూ మనకు రోడ్డుపై తారసపడుతుంటారు. ఒకే బైక్ పై ఏకంగా నలుగురు ఎక్కేసి.. రయ్యాంటూ వెళ్లడమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులుకు చుక్కలు చూపిస్తుంటారు. వారికేమైనా అవుతుందేమోనన్న ఖంగారులో వాహనదారులు నమ్మెదిగా వెళ్తుండటం మనం నిత్యం చూస్తూనే వుంటాం. అయితే అలాంటి పనులే అమ్మాయిలు చేస్తే.. అమ్మో వీళ్లు అమ్మాయిలేనా..? అన్న ప్రశ్నలు సర్వసాధరణంగా తెరపైకి వస్తుంటాయి. సరిగ్గా అలాగే జరిగింది. ఒకే బైక్ పై ఐదుగురు అమ్మాయిలు రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

దక్షిణ చైనాలోని హెజోవ్ నగరంలోని రోడ్లపై అమర్చిన సీసీకెమెరాల్లో ఐదుగురు అమ్మాయిలు బైక్ పై ప్రయాణిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే వారు కొద్ది దూరం ప్రయాణించగానే పోలీసులకు చిక్కారు. ఐదురుగురిలో నలుగురు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. బైక్ పై ఎక్కువ మంది కూర్చోవడమే కాకుండా డ్రైవింగ్ చేసిన అమ్మాయికి లైసెన్స్ కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. వర్షాలతో తడిగా ఉన్న రోడ్ల పై ఐదుగురు అమ్మాయిలు ప్రయాణించడమేంటని వీడియోని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles