ఖైరతాబాద్ గణేశుడికి ఆ లడ్డు దూరం | no more Tapeswaram laddu for khairatabad ganesha

No more tapeswaram laddu for khairatabad ganesha

khairatabad ganesh, Tapeswaram laddu, khairatabad ganesh news, local laddu for khairatabad gaesha, latest news, telangana news, ఖైరతాబాద్ గణేషుడికి లోకల్ లడ్డూ, తాపేశ్వరం లడ్డూ ఇక లేనట్లే, తెలంగాణ వార్తలు, తాజావార్తలు

khairatabad ganesh utsav Committee decided no more Tapeswaram laddu for tallest ganesha.

ఖైరతాబాద్ గణేశుడికి ఆ లడ్డు దూరం

Posted: 06/25/2016 10:54 AM IST
No more tapeswaram laddu for khairatabad ganesha

జంట నగరాల జనాలకు షాకింగ్ న్యూస్. ఇకపై ఖైరతాబాద్ భారీ వినాయకుడు అందించే లడ్డు రుచి మారబోతుంది. గతంలో ఏపీ లోని తాపేశ్వరం నుంచి వచ్చే ఈ భారీ లడ్డును ఇప్పుడు స్థానికంగానే తయారు చేయించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

గత ఐదేళ్లుగా ఈ భారీ వినాయకుడి చేతిలో తూగో జిల్లాకు చెందిన  మల్లి బాబు ఫ్రీగా అందించే తాపేశ్వరం లడ్డూయే కనిపించేది. రుచికరమైన ఈ లడ్డూను నిమజ్జనంకు ముందు ఉత్సవ కమిటీ ఉచితంగా భక్తలకు పంచేంది. అయితే గతేడాది లడ్డూ పంపకం నిర్వాహకులకు బాగా కష్టంగా మారింది. ఒక్కసారిగా భక్తులు పోటెత్తి ఎవరికి అందినంతా వారు పట్టుకుపోయారు. దీంతో ఇలాంటి సమస్యలను వద్దనుకున్న నిర్వాహకులు మల్లి బాబు లడ్డుకు సారీ చెప్పేశారు. అంతేకాదు 6 టన్నులుగా ఉన్న ఈ లడ్డూ సైజును 5 టన్నులే చేయించాలని నిర్ణయించినట్లు కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ తెలిపారు.

అయితే ఈ విషయంపై మల్లిబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తనకు ముందస్తుగా ఒక్క మాట కూడా చెప్పలేదేని, గత ఐదేళ్లుగా లడ్డూతో మహాగణేశుడి సేవలో తరిస్తున్న తనకి ఆ నిర్ణయం షాకిచ్చిందని చెబుతున్నాడు. అయితే ఈసారి అమరావతిలో నిలపబోయే భారీ వినాయకుడికి లడ్డూ సమర్పిస్తానని, ఇందుకోసం సీఎం చంద్రబాబును త్వరలో కలవనున్నట్లు ఆయన చెప్పాడు.

ఖైరతాబాద్ తాపేశ్వరం లడ్డూ:
- ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఈ భారీ లడ్డూ తయారు చేస్తుంది.
- 18 లక్షలతో ప్రముఖ స్వీట్ల కంపెనీ యజమాని పీవీవీఎస్ మల్లిఖార్జున రావు అలియాస్ మల్లిబాబు దీనిని ఉచితంగా స్పాన్సర్ చేస్తున్నాడు.
- 2010లో మల్లిబాబు తొలిసారి 500 కిలోల లడ్డూ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ప్రతియేటా బరువు పెంచుతూ వస్తున్నాడు.
- 2011లో దాన్ని 2,400 కిలోలకు, 2015లో 6,000 కిలోలకు పెంచారు. 2013లో 5,000 కిలోల లడ్డూ ఇచ్చినా, భారీ వర్షం తర్వాత దాని మీద టార్పాలిన్ కప్పడంతో అది పాడైపోయింది. దాంతో లడ్డూను కూడా     హుస్సేన్సాగర్లో నిమజ్జన చేసేశారు.
- 2015 లో 6 టన్నుల భారీ లడ్డనూ ఆయన సమర్పించారు.

కాగా, జీడిపప్పు, బాదంపప్పు, పచ్చ కర్పూరం, యాలకులు, సెనగపప్పు, నెయ్యి , పంచదార భారీ స్థాయిలో వినియోగించి తయారు చేసే ఈ టేస్టీ లడ్డూ రుచికి ఇకపై జంట నగరవాసులు దూరం కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles