నిరవధిక సమ్మెలో కేంద్ర ఉద్యోగులు? | Central employees prepare for strike from July 11

Central employees prepare for indefinite strike from july 11

Central employees strike, July 11 strike, railway strike, railway unions strike, Central employees strike notice, కేంద్ర ఉద్యోగుల సమ్మె, రైల్వే సిబ్బంది సమ్మె, కేంద్ర సిబ్బంది సమ్మె, తాజా వార్తలు, తెలుగు వార్తలు

Central employees prepare for indefinite strike from July 11 in India.

నిరవధిక సమ్మెలో కేంద్ర ఉద్యోగులు?

Posted: 06/25/2016 09:47 AM IST
Central employees prepare for indefinite strike from july 11

ఇప్పటికే రైల్వే ఉద్యోగుల స్ట్రైక్ నోటీసుతో ఉక్కిరి బిక్కిరి కేంద్ర ప్రభుత్వానికి మరో సమ్మె హెచ్చరిక జారీ అయ్యింది. రైల్వే తో పాటు పోస్టల్, రక్షణతోపాటు మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా అదే రోజు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఉద్యోగ విధానాల మార్పులను వ్యతిరేకించడంతోపాటు న్యాయమైన 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైల్వే, రక్షణ, తపాలా ఉద్యోగులు సామూహికంగా ధర్నా నిర్వహించారు. ఈ మేరకు వచ్చే జూలై 11వ తేదీ నుంచి ఆయా శాఖలు కూడా తమతో సమ్మెలో పాల్గొంటాయని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మీడియాతో తెలిపారు.

సమస్యలను పరిష్కరిస్తే సమ్మెపై పునరాలోచిస్తామని ఆయన తెలిపారు. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, రైల్వే ప్రైవేటీకరణకు అనుమతించరాదని, బోనస్ పెంచాలని, కార్మికుడి పదవీకాలంలో 5 పదోన్నతులు కల్పించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే తదితర డిమాండ్లు అందులో ఉన్నాయి. కాగా, జూలై 11 ఉదయం 6 గంటల నుంచే అన్ని శాఖలు  సమ్మెలో పాల్గొంటాయని సమాచారం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles