congress call for state wide protest in telangana

Protests in telangana on outreach of electricity charges rtc fares

Electricity charges, Bus fare hike, Uttamkumar Reddy, CM KCR, TPCC, purushotham reddy, Tammineni Veerabhadram, CPM, Government, Mission Kakatiya scheme, protests, congress, left parties

A State-wide protest call from congress and left parties against the hike of RTC fares and Electricity charges in Telangana

విద్యుత్ బిల్లు, ఆర్టీసీ చార్జిల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Posted: 06/25/2016 08:41 AM IST
Protests in telangana on outreach of electricity charges rtc fares

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చార్జీల పెంపు నిర్ణయాలపై విపక్షాలు అందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఒకేసారి ఇటు విద్యుత్ చార్జీలు, అటు బస్సు చార్జీల పెంపుకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్, వామపక్షాలు పిలుపునిచ్చాయి. భాగ్యవంతమైన రాష్ట్రమని అధికారాన్ని చేపట్టి చేపట్టగానే చెప్పిన కేసీఆర్.. రాష్ట్ర ఖజానాకు అదాయం పుష్కలంగా వుందని.. చెప్పి రెండేళ్లు కూడా తిరగకుండానే చార్ఝీలను పెంచడం సబబుకాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఉద్యమంలో కలసివచ్చిన ఆర్టీసీ కార్మికులకు మేలు చేసేందుకు వీలుగా ప్రజలపై బస్సుచార్జీల పెంపుకు ప్రభుత్వం మొగ్గుచూపిందని, దీని వల్ల పేద ప్రయాణికులపై భారం మోపడం సమంజసం కాదని  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు, విద్యుత్ చార్జీల పెంపుతో అన్నివర్గాల ప్రజలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెనుభారం మోపిందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. చార్జీల పెంపు ఉండదని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసిందని, దీనిని నిరసిస్తూ అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఊరేగింపులు, ధర్నాలు చేపట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలను కోరారు.

విద్యుత్, ఆర్టీసీ బస్ చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కరువుతో తల్లడిల్లుతున్న ప్రజలపై ఒకేసారి రెండువైపులా చార్జీలను పెంచి భారం మోపడం తగదన్నారు. చార్జీలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా ఉన్నప్పటికీ చిన్ననీటి ప్రాజెక్టులను విస్మరించి పెద్ద ప్రాజెక్టులపై దృష్టి సారించడం కాంట్రాక్టర్ల కోసమేనా అని ప్రశ్నించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles