కేటీఆర్ తండ్రి రికార్డు బద్ధలు కొట్టేశాడు | KTR beat KCR in google search

Ktr beat kcr in google search

KTR, KCR, google search, KTR in google search, CBN in google search, Jagan in google search

KTR beat KCR and topped in google search

కేటీఆర్ తండ్రి రికార్డు బద్ధలు కొట్టేశాడు

Posted: 06/24/2016 12:13 PM IST
Ktr beat kcr in google search

తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు తండ్రి, సీఎం కేసీఆర్ రికార్డును బద్ధలు కొట్టేశాడు. ఓవైపు జనాదరణ ఉన్న నేతగానేకాదు, పాలనాలో తండ్రిని మించి పోవాలని చూస్తున్న ఆయన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నేతలకు సంబంధించి ‘గూగుల్ సెర్చి’లో ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అంతకు ముందు ఆ రికార్డు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరిట ఉండేది.

మొన్నటిదాకా గూగుల్ సెర్చిలో కేసీఆర్ ఇరు రాష్ట్రాలలో అందరికంటే ముందున్నాడు. తెలంగాణ యాసకు, భాషకు మునుపెన్నడూ లేనంత గుర్తింపు తెచ్చిన నేతగా ఆయనకు జనాలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆయన కుమారుడిగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నెటిజన్ల వెతుకలాట మొత్తం కేటీఆర్ గురించే ఉంది. అంతేకాదు కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించడం, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చేదిద్దే బాధ్యతలను నెత్తిన వేసుకుని ఆ ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు.

ఇక ఏపీ విషయానికొస్తే... ప్రతిపక్ష నేత జగన్ జాడ లేకుండా పోయారు. అప్పట్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కంటే కాస్తంత మెరుగైన పరిస్థితిలో ఉన్న జగన్ క్రమంగా ప్రాబల్యం కోల్పోతూ వస్తున్నాడు. గూగుల్ సెర్చిలో ‘రాయలసీమ స్ట్రాంగ్ మ్యాన్’ గా పేరొందిన జగన్... ప్రస్తుతం చంద్రబాబు కంటేనే కాదు, మంత్రుల కంటే కూడా బాగా వెనుకబడ్డారట. స్వల్ప వ్యవధిలోనే నవ్యాంధ్ర నూతన రాజధానికి శంకుస్థాపన చేయగలిగిన చంద్రబాబును సెర్చి చేస్తున్న నెటిజన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇరు రాష్ట్రాల్లో కలుపుకుంటే మాత్రం కేటీఆరే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  KCR  CBN  Jagan  Google Search  

Other Articles