వాళ్ల ఎంపికతో కటీఫ్ కు సంకేతాలు? | TDP and BJP announced their Rajyasabha candidates

Tdp and bjp announced their rajyasabha candidates

Sujana Chowdary, TG venkatesh, suresh prabhu, rajyasabha candidates, రాజ్యసభ అభ్యర్థులు, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, political news

TDP and BJP announced their Rajyasabha candidates. cabinet minster suresh prabhu in andhra quota. TG venkatesh and sujana chowdary for TDP candidates.

వాళ్ల ఎంపికతో కటీఫ్ కు సంకేతాలు?

Posted: 05/30/2016 06:38 PM IST
Tdp and bjp announced their rajyasabha candidates

ఎట్టకేలకు టెన్షన్ కు తెరపడింది. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. అయితే ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ-బీజేపీ పొత్తు తెగిపోనుందా? బీజేపీయే తెలుగుదేశానికి దూరంగా జరుగుతోందా? అని. కానీ, ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.  మహారాష్ట్రకు చెందిన కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు ఆంధ్రా కోటాలో రాజ్యసభ సీటుకు అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ విషయం దాదాపుగా ఖరారైంది. పొత్తులో భాగంగా నిర్మలా సీతారామన్ కు గతంలో సీటు కేటాయించగా, ఇప్పుడు టీడీపీతో సంప్రదించకుండానే నేరుగా సురేష్ పేరును బీజేపీ ప్రకటించింది. తిరిగి అదే సీటు నుంచి ఆశలు పెట్టుకున్న నిర్మలా సీతారామన్ కు ఈసారి కర్ణాటక నుంచి అవకాశం కల్పించింది. సురేష్ ప్రభు మంగళవారం నామినేషన్ వేసే అవకాశం ఉంది.  

భవిష్యత్తులో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శలకు తలెత్తకుండా ఉండేందుకే బీజేపీ ఈ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఒకవేళ పొత్తును తెంచుకోవాల్సి వస్తే సొంత పార్టీ నేతలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నదే బీజేపీ అభిమతం అయి ఉండొచ్చని, అందుకు అనుగుణంగానే ఇక్కడి నేతలను పక్క రాష్ట్రాల నుంచి సీట్లు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి అభ్యర్థుల ఎంపికలో మల్లాగుల్లాలు పడ్డప్పటికీ చివరికి కర్నూల్ సీనియర్ నేత టీజీ వెంకటేష్, కేంద్ర మంత్రి యలమంచిలి సుజనా చౌదరిలకు అవకాశం దక్కింది. పార్టీని కష్టకాలంలో ఆదుకోవటంతోపాటు, జాతీయ స్థాయి నేతలతో సుజనా చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి. వీరి ఎంపికలో ఒకరినోకరు సంప్రదించుకోకపోవటంతో మిత్రపక్షాల పొత్తు పరిస్థితి గాల్లో దీపం మాదిరి తయారయ్యంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sujana Chowdary  TG venkatesh  suresh prabhu  rajyasabha candidates  

Other Articles