చంద్రుడికి చెప్పు రుచి చూపాలనుకుంది | woman Tries To Throw Slipper At chandrababu in mahanadu

Woman tries to throw slipper at chandrababu in mahanadu

tirupathi mahanadu, woman chappal, చంద్రబాబు నాయుడు, తిరుపతి మహనాడు, మహిళా కార్యకర్త, చెప్పు, AP news, AP politics, latest news.

woman tries to throw chappal at chandrababu in tirupathi mahanadu. police arrested that woman and proper details not known.

చంద్రుడికి చెప్పు రుచి చూపాలనుకుంది

Posted: 05/30/2016 11:03 AM IST
Woman tries to throw slipper at chandrababu in mahanadu

నేతలపై అసంతృప్తి వెల్లగక్కుతూ సొంత కార్యకర్తలే నిరసన గళం విప్పటం అనేకసార్లు చూశాం. వ్యతిరేక నినాదాలు చేయటమో, లేదా వినూత్న రీతిలో నిరసన తెలిపిన సందర్భాలు కోకోల్లలు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి చెప్పులు వేసిన ఘటనలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీడీపీ మహిళా విభాగం కార్యకర్త ఒకరు ఏకంగా ఆయనకు చెప్పు చూపించటంతో అంతా షాక్ కి గురయ్యారు. తిరుపతి వేదికగా జరిగిన మహానాడులో ఈ ఘటన చోటుచేసుకుంది

మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ వద్ద చంద్రబాబు ప్రసంగిస్తుండగా, సడన్ గా ఓ మహిళ లేచి నిల్చుంది. ఇప్పటి దాకా నువ్వు ఏం చేశావంటూ నిలదీస్తూ తన చెప్పు చూపించింది. దీంతో బాబుతో సహా అంతా బిత్తర పోయారు. చెప్పును ఆయన పైకి విసిరేందుకు ప్రయత్నించగా, వెంటనే పక్కనున్న మహిళలు అప్రమత్తమై ఆమెను అపారు. ఆపై పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎందుకిలా చేసిందో అర్థం కావటం లేదని తోటి మహిళలు చెబుతున్నారు. ఒకవేళ కార్యకర్తలు అడ్డుకోకపోయి ఉంటే ఆ మహిళ చెప్పు బాబును తాకి ఉండేదని పోలీసులు చెబుతున్నారు. ఆమె ఎవరో, ఎందుకిలా చేసిందో విచారిస్తున్నామని వెల్లడించారు. గతంలో  ఒబామా, కేజ్రీవాల్ లాంటి నేతలపై చెప్పులు పడ్డ ఘటనలు చూశాం. కాస్త ఉండి ఉంటే ఆ లిస్ట్ లోకి బాబు కూడా చేరిపోయేవారేమో.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahanadu  tirupathi  TDP  chandrababu naidu  woman slipper  

Other Articles