నగ్న ఫోటోలు పంపి దొరికిపోయిన కిడ్నాపర్లు | three woman jailed for filming naked woman in Dubai

Three woman jailed for filming naked woman in dubai

woman jailed, dubai, kidnap, filming naked, దుబాయ్, యువతి కిడ్నాప్, నగ్నంగా చిత్రీకరణ, international news, latest news, entertainment

Three Moroccan women and an Egyptian businessman, 30, have each been sentenced by the Court of First Instance to three years in jail for kidnapping a Moroccan woman and filming her naked to blackmail her brother for a 7 million Moroccan dirham ransom. Three other women (two Moroccans, aged 26 and 24, and an Ethiopian maid, 30 have each been sentenced to two years in jail for helping and abetting the four main defendants confine the victim in a flat and deprive her of freedom.

నగ్న ఫోటోలు పంపి దొరికిపోయిన కిడ్నాపర్లు

Posted: 05/27/2016 06:56 PM IST
Three woman jailed for filming naked woman in dubai

డబ్బు కోసం మహిళలే కిడ్నాపర్ల అవతారం ఎత్తారు. ఆ ముగ్గురు కలిసి ఓ మహిళను కిడ్నాప్ చేశారు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టసాగారు. డబ్బు కోసం ఆమె సోదరుడికి బెదిరింపు కాల్స్ చేశారు. కానీ, అక్కడే ఓ చిన్నపొరపాటుతో పోలీసులకు చిక్కి జైల్లో పడ్డారు. దుబాయ్ లో గతేడాది జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేరం రుజువు కావటంతో ఆ ముగ్గురికి ఇప్పుడు శిక్షలు ఖరారయ్యాయి.

29 ఏళ్ల ఓ మేనిక్యూరిస్ట్ ఆల్ సహ్దా ప్రాంతంలో టాక్సీ కోసం ఎదురుచూస్తుండగా ఓ మహిళ బృందం ఆమెను కిడ్నాప్ చేసింది. దగ్గర్లోని తమ ఫ్లాట్ కు తీసుకెళ్లి, ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా ఫోటోలు, వీడియో తీశారు. వాటిని వాట్సాప్ ద్వారా ఇటలీలో ఉంటున్న ఆమె సోదరుడికి పంపారు. భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేశారు. లేకపోతే ఆ వీడియోను నెట్ లో పెడతామని బెదిరించారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని అతను కోరగా, దానికి వారు ఒప్పుకున్నారు. ఈ గ్యాప్ లో దుబాయ్ లోని తన స్నేహితులకు విషయం చెప్పగా, వారు పోలీసుల సాయంతో నిందితుల కోసం వెతకసాగారు. అయితే వాట్సాప్ లో పంపిన ఫోటోల ఆధారంగా నిందితుల ఫ్లాట్ ను పోలీసులు తేలికగానే కనుగొన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ ముగ్గురు మహిళలు, వారికి సహకరించిన ఓ ఈజిప్ట్ వ్యాపారవేత్తను శిక్ష పూర్తయి బయటికి రాగానే గల్ఫ్ చట్టాల ప్రకారం దేశ బహిష్కరణ చేస్తారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women jailed  dubai  kidnap  filming naked  

Other Articles